K Raghavendra Rao సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసిన బిగ్ బాస్ రతిక

by Disha Web Desk 10 |
K Raghavendra Rao సినిమాలో  హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసిన బిగ్ బాస్ రతిక
X

దిశ,వెబ్ డెస్క్: బిగ్ బాస్ లేటెస్ట్ సీజన్‌లో రతిక మంచి క్రేజ్ సంపాదించుకుంది. హౌస్‌లో ఉన్నంత సేపు తన అందంతో కుర్రాళ్ల గుండెల్ని ఈ బ్యూటీ. కట్టిపడేసింది. అయితే ఆటలో పెద్దగా యాక్టివ్‌గా లేకపోవడం, అందరితోనూ గొడవలు పెట్టుకుంటుందని.. నాలుగో వారమే ప్రేక్షకులు ఈమెను బయటకు పంపించేశారు. అయితే బిగ్‌బాస్‌లోకి రాకముందే చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో మెరిసింది రతిక. కానీ తాజాగా రతిక ఓ బంపర్ ఆఫర్ కొట్టేసింది. దిగ్గజ దర్శకుడు కే రాఘవేంద్రరావు సినిమాలో హీరోయిన్‌గా రతిక సెలక్ట్ అయింది. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.

"లెజెండరీ డైరెక్టర్ కే రాఘవేంద్రరావు సినిమాలో అవకాశం రావడం నిజం నా అదృష్టం.ఇన్నేళ్లకు నా కల నెరవేరింది, నా ఫొటోలు, నేను చేసిన కొన్ని సినిమాల్లో సీన్లు చూసి ఈ పాత్రకి నేను న్యాయం చేస్తానని రాఘవేంద్రరావు నమ్మారు. ఆయన సినిమా అని చెప్పగానే నేను వెంటనే ఓకే చేసేశాను. ఇందులో నా పాత్ర గురించి ఇప్పుడేం చెప్పలేను. కానీ ఇదొక ఎమోషనల్ లవ్ స్టోరీ. త్వరలోనే మీకు అన్ని వివరాలు చెబుతానంటూ" తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.



Next Story

Most Viewed