వివాదాలు చుట్టుముట్టిన పాత్రలే కావాలి.. బోల్డ్ బ్యూటీ

by Disha Web Desk 7 |
వివాదాలు చుట్టుముట్టిన పాత్రలే కావాలి.. బోల్డ్ బ్యూటీ
X

దిశ, సినిమా : అప్ కమింగ్ మూవీ 'గోవింద నామ్ మేరా'లో గ్రే-షేడ్ క్యారెక్టర్ చేయడానికి గల కారణాలు వెల్లడించింది భూమి పెడ్నేకర్. విక్కీ కౌశల్, కియారా అద్వానీ ప్రధానపాత్రలు పోషిస్తు్న్న ఈ క్రైమ్ అండ్ కామెడీ ఫిల్మ్ డిసెంబర్ 16 నుంచి డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. ఈ సందర్భగా ప్రమోషన్స్‌లో పొల్గొంటున్న నటి.. నిజంగా కష్టపడి పనిచేయగలననే నమ్మకంతో నిర్మాతలు ఏ పాత్ర ఆఫర్ చేసిన వెనకాడనని, ముఖ్యంగా ఇలాంటి చాలెంజ్‌ క్యారెక్టర్స్ చేయడం థ్రిల్‌గా ఫీల్ అవుతానని చెప్పింది.

కళాకారిణిగా నైపుణ్యాలు పెంచుకోవడం అతిపెద్ద కర్తవ్యమని భావిస్తానన్న ఆమె.. ఈ చిత్రంలో తన నటనతో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాననే నమ్మకం ఉందని చెప్పింది. అలాగే కంఫర్ట్ జోన్ నుంచి బయటపడేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటానన్న భూమి.. గతంలో చేసిన క్యారెక్టర్స్‌ను ఫాలో కాకుండా కొత్తగా ట్రై చేస్తానంటోంది. ఇక ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్ నిర్మించిన ఈ మూవీకి శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించాడు.



Next Story

Most Viewed