- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గోవాలో హోటల్ పెట్టిన బోల్డ్ బ్యూటీ.. వాళ్లకోసం ప్రత్యేక వసతులున్నాయట
ఇటీవల గోవాలో స్థాపించిన ఒక కొత్త హోటల్‌లో పార్ట్‌నర్‌గా చేరి భారీగా పెట్టుబడి పెట్టిందనే వార్తలపై భూమి పెడ్నేకర్ ఓపెన్ అయింది. ఈ మేరకు ముంబైకి చెందిన హాస్పిటాలిటీ గ్రూప్‌తో చేతులు కలిపి మొదటి బోటిక్ హోటల్‌కు

దిశ, సినిమా: ఇటీవల గోవాలో స్థాపించిన ఒక కొత్త హోటల్‌లో పార్ట్‌నర్‌గా చేరి భారీగా పెట్టుబడి పెట్టిందనే వార్తలపై భూమి పెడ్నేకర్ ఓపెన్ అయింది. ఈ మేరకు ముంబైకి చెందిన హాస్పిటాలిటీ గ్రూప్‌తో చేతులు కలిపి మొదటి బోటిక్ హోటల్‌కు తాను ఒక యాజమానిగా ఉన్నది నిజమేనని చెప్పింది. ‘ఇది జీవితం చివరి దశలో విశ్రాంతి కోరుకునే ప్రయాణీకుల కోసం ప్రత్యేకంగా నిర్వహించాం. వెండితెరను దాటి కొత్త మార్గాలను అన్వేషించాలని నేను ఎల్లప్పుడూ కోరుకుంటాను. ఇలాంటి పెట్టుబడుల మరింత శక్తిని ఇస్తాయని బలంగా నమ్ముతా. నాపై నేను ఎంతో విశ్వాసంతో ఇలాంటి ప్రయోగాలు చేస్తా. నాకు శక్తి ఉంది. ఇదంతా నా జీవితాన్ని సంపూర్ణంగా గడపడం, మరపురాని అనుభవాలను సృష్టించడం కోసమే. అలాగే అభిరుచికి అనుగుణంగా ఉండటమే కాదు.. బాధ్యతాయుతమైన పనులు చేయడంలోనూ నిబద్ధతను కలిగివుంటాను’ అంటూ పలు విషయాలు చెప్పుకొచ్చింది.
Also Read: ఆస్కార్ ఇవ్వాల్సింది ఎన్టీఆర్, రామ్ చరణ్‌కు కాదు ఆయనకే ఇవ్వాలి.. RGV ట్వీట్






