- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అరుదైన ఘనత సాధించిన ‘భ్రమయుగం’.. ప్రపంచ వేదికపైకి లెజెండరీ యాక్టర్ సినిమా
ఇటీవల ప్రకటించిన 55వ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులలో నాలుగు విభాగాల్లో సత్తా చాటిన ‘భ్రమయుగం’ (Bramayugam)చిత్రం, మరో అరుదైన ఘనతను సాధించింది.

దిశ, సినిమా: ఇటీవల ప్రకటించిన 55వ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులలో నాలుగు విభాగాల్లో సత్తా చాటిన ‘భ్రమయుగం’ (Bramayugam)చిత్రం, మరో అరుదైన ఘనతను సాధించింది. లాస్ ఏంజెల్స్‌లోని ‘అకాడమీ మ్యూజియం ఆఫ్ మోషన్ పిక్చర్స్’ లో ‘భ్రమయుగం’ ప్రత్యేక ప్రదర్శనకు సిద్ధమైంది. ఈ ప్రదర్శన ఫిబ్రవరి 12, 2026న అకాడమీ మ్యూజియం ‘వేర్ ది ఫారెస్ట్ మీట్స్ ది సీ: ఫోక్లోర్ ఫ్రమ్ ఎరౌండ్ ది వరల్డ్’(Where the Forest Meets the Sea: Folklore from Around the World) చిత్రోత్సవ శ్రేణిలో భాగంగా జరుగనుంది. ఈ కార్యక్రమం జనవరి 10వ తేదీ నుంచి ఫిబ్రవరి 12వ తేదీ వరకు కొనసాగుతుంది.
నైట్ షిఫ్ట్ స్టూడియోస్ వైనాట్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి రాహుల్ సదాశివన్ (Rahul Sadashivan)రచన, దర్శకత్వం వహించారు. ఈ చిత్రం, కేరళ జానపద కథల చీకటి యుగాల నేపథ్యంలో భయం, శక్తి మానవ బలహీనతలను ఆవిష్కరించిన గాఢమైన అన్వేషణ. బ్లాక్ & వైట్ ఫార్మాట్‌లో తెరకెక్కించబడింది. కట్టిపడేసే కథాకథనాలు, అద్భుతమైన సాంకేతికతతో విశేష ప్రశంసలు అందుకుంది. ‘భ్రమయుగం’ చిత్రంలో కొడుమోన్ పోట్టి అనే పాత్రలో మలయాళ మెగాస్టారు నటుడు మమ్ముట్టి (Mammootty)అద్భుతమైన నటన కనబరిచారు. అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్దా లిజ్ ముఖ్య పాత్రల్లో నటించారు.






