యూట్యూబ్ కుక్‌గా ప్రియమణి.. త్వరలో వడ్డించనున్న 'భామా కలాపం'

by Ajay Maddhiboyina |

యూట్యూబ్ కుక్‌గా ప్రియమణి.. త్వరలో వడ్డించనున్న భామా కలాపం
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ప్రియమణి అందరికీ సుపరిచితమే. ప్రస్తుతం ప్రియమని హీరోయిన్‌గా అంతగా కనిపించకపోయినా.. తనదైన పాత్రలతో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే ప్రియమణి నటించిన లేటెస్ట్ మూవీ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకి 'భామా కలాపం' అని పేరు పెట్టారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ అందరినీ అలరించింది. ప్రతి ఒక్కరిలో సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇందులో ప్రియమని యూట్యూబ్ కుక్‌గా కనిపిస్తోంది. ఇన్నాళ్లు కూరగాయలు, మాంసం వండుతూ మంచి గుర్తింపు అందుకుంది. కానీ ఈరోజు కొత్త డిష్ చేసేందుకు సిద్ధమైంది. అందుకోసం ప్రియమణి దేన్నో తరగాల్సి ఉంది. అదేంటనేది తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే. ప్రస్తుతం ఈ గ్లింప్స్ ప్రేక్షకుల్లో ఉత్సుకతను రేకెత్తిస్తోంది. మరి సినిమా అంతా కూడా అదే సస్పెన్స్‌తో నడుస్తుందా లేదా అనేది చూడాలి.

Next Story