- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్టార్ హీరో సరసన లక్కీ చాన్స్ కొట్టేసిన భాగ్యశ్రీ బోర్సే.. బర్త్ డే స్సెషల్‌గా షాకింగ్ లుక్ రివీల్ చేసిన మేకర్స్
నేడు భాగ్యశ్రీ బోర్సే పుట్టినరోజు సందర్భంగా, ఆమె నటిస్తున్న ‘సెయాన్’ చిత్రబృందం ఒక సర్ప్రైజ్ అప్‌డేట్‌ను అందించింది. ఈ సినిమాలోని భాగ్యశ్రీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయగా, అది ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

దిశ, సినిమా: దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే తన అదృష్టాన్ని పరీక్షించుకునే దశలో ఉంది. తెలుగులో రవితేజ సరసన 'మిస్టర్ బచ్చన్' సినిమాతో భారీ ఆశలతో అడుగుపెట్టినప్పటికీ, ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో ఈ అమ్మడికి టాలీవుడ్‌లో మొదటి ప్రయత్నంలో నిరాశే ఎదురైంది. అయితే, పట్టువదలని విక్రమార్కుడిలా ఇప్పుడు కోలీవుడ్‌లో తన అదృష్టాన్ని వెతుక్కుంటోంది. భాగ్యశ్రీ బోర్సేకు తమిళ చిత్ర పరిశ్రమలో ఒక బంపర్ ఆఫర్ దక్కింది. కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తీకేయన్ సరసన హీరోయిన్‌గా నటించే అవకాశాన్ని ఆమె దక్కించుకుంది. నేడు భాగ్యశ్రీ బోర్సే పుట్టినరోజు సందర్భంగా, ఆమె నటిస్తున్న ‘సెయాన్’ చిత్రబృందం ఒక సర్ప్రైజ్ అప్‌డేట్‌ను అందించింది. ఈ సినిమాలోని భాగ్యశ్రీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయగా, అది ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో భాగ్యశ్రీ లుక్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బ్లూ కలర్ చుడిదార్ ధరించి, నుదుట కుంకుమ, జడలో మల్లెపూలతో అచ్చమైన కేరళ అమ్మాయిలా ఆమె మెరిసిపోతోంది. అయితే, ముఖంలో మాత్రం తీవ్రమైన కోపం కనిపిస్తోంది. చేతిలో ఒక పెద్ద నెమలి ఈకను పట్టుకుని ఎవరినో హెచ్చరిస్తున్నట్లుగా ఉన్న ఆమె చూపులు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ప్రస్తుతం ఈ లుక్ నెటిజన్లను షాక్’కు గురి చేస్తుండగా.. మరికొందరు ఫిదా అయిపోతున్నారు. శివకుమార్ మురుగేశన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2026లో ఒక గ్రాండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా, మాస్ ఎలిమెంట్స్, ఎమోషన్స్‌తో ఈ సినిమా రాబోతోంది. కోలీవుడ్‌లో బిజీగా ఉంటూనే, తెలుగులో తన రెండో ప్రయత్నంగా అక్కినేని అఖిల్ సరసన ‘లెనిన్’ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. జూన్ 26న విడుదల కానున్న ఈ చిత్రంపై భాగ్యశ్రీ భారీ ఆశలే పెట్టుకుంది. అటు స్టార్ హీరో శివకార్తీకేయన్, ఇటు యంగ్ హీరో అఖిల్.. సినిమాలతో ఈ ఏడాది భాగ్యశ్రీ బోర్సే కెరీర్ మలుపు తిరుగుతుందో లేదో చూడాలి.






