‘భద్రాకాళి’ ట్రైలర్ అప్డేట్..రాజకీయ తుఫాను తలెత్తనుందంటూ హైప్ పెంచేస్తున్న పోస్ట్

by Mallepaka Hamsa |

కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని (Vijay Antony)నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భద్రకాళి’(Bhadrakali).

‘భద్రాకాళి’ ట్రైలర్ అప్డేట్..రాజకీయ తుఫాను తలెత్తనుందంటూ హైప్ పెంచేస్తున్న పోస్ట్
X

దిశ, సినిమా: కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని (Vijay Antony)నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భద్రకాళి’(Bhadrakali). పొలిటికల్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ చిత్రం విక్రమ్ ప్రభు(Vikram Prabhu) దర్శకత్వంలో తెరకెక్కుతోంది. విజయ్ ఆంటోనీ కెరీర్‌లో 25వ చిత్రంగా రాబోతుండగా.. ఇందులో సునీల్ కృపలానీ, సెల్ మురుగన్, మాస్టర్ కేశవ్, తృప్తి రవీంద్ర, వాగై చంద్రశేఖరం కీలక పాత్రలో కనిపించనున్నారు. దీనిని తెలుగులో ఏసియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. విజయ్ ఆంటోని సంగీతం అందిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 19న రిలీజ్ కాబోతుంది. ఈక్రమంలో.. తాజాగా, విజయ్ ఆంటోని ‘భద్రకాళి’ చిత్రానికి సంబంధించిన అప్డేట్ రాబోతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ సెప్టెంబర్ 8న సాయంత్రం 5 గంటలకు రాబోతున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్‌ను షేర్ చేశారు. నోట్ల కట్టలపై కూర్చొని ఉండగా.. చుట్టూ జనాలు ఉన్నారు. ఇక ఈ పోస్టర్‌కు ‘‘రాజకీయ తుఫాను తలెత్తనుంది’’ అనే క్యాప్షన్ జత చేయడం ఆసక్తికరంగా మారింది.

link

Next Story