Ram Pothineni: రామ్ కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్.. Skanda మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా..?

by Disha Web Desk 10 |
Ram Pothineni: రామ్ కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్..  Skanda మూవీ  ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా..?
X

దిశ,వెబ్ డెస్క్: రామ్ స్కంద సినిమా మీద ప్రస్తుతం సోషల్ మీడియాలో భారీ ట్రోలింగ్ జరుగుతోంది. ఎట్టకేలకు నేడు స్కంద మూవీ విడుదల అయింది. బోయపాటి శ్రీను మీద నెటిజెన్స్ ఒక రేంజ్ లో మండి పడుతున్నారు.. సినిమా పేరు ఏంటి ఇలా ఉందని.. స్కంద అనే టైటిల్ ఎందుకు పెట్టారంటూ మేకర్ల మీద కౌంటర్లు వేస్తున్నారు. పోటీలో సరైన సినిమా లేకపోతే ఆ సమయంలో ఏ సినిమా ఉంటే ఆ సినిమాలను జనాలు చూస్తారని చెప్పడానికి స్కంద మూవీ ఒక పెద్ద ఉదాహరణ అంటూ నెటిజన్లు అంటున్నారు. ట్రోల్స్ చేసినా సినిమాకు ప్లస్ అయింది. చంద్రముఖి 2 సినిమా మీద అంతగా అంచనాలు లేకపోవడం వలన ప్రేక్షకులు స్కందకే ఓటు వేశారు. పోటీలో ఏ సినిమా లేకపోవడంతో స్కంద మూవీ కలెక్షన్స్ లో దూసుకెళ్తుంది. రామ్ కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్ వచ్చిన మూవీగా ఇది నిలిచింది. స్కందకు ఫస్ట్ డే 18 కోట్లకు పైగా గ్రాస్ వచ్చినట్టు అధికారికంగా ప్రకటించారు.

Next Story

Most Viewed