సీక్రెట్‌గా ప్రియురాలితో ఎంగేజ్‌మెంట్ చేసుకుని షాకిచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్..

by Mallepaka Hamsa |

గత మూడు రోజులుగా వినిపిస్తున్న వార్తలను నిజం చేస్తూ, నేడు మార్చి 8న హైదరాబాద్‌లో శ్రీనివాస్ నిశ్చితార్థం సీక్రెట్‌గా జరిగింది.

సీక్రెట్‌గా ప్రియురాలితో ఎంగేజ్‌మెంట్ చేసుకుని షాకిచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్..
X

దిశ, సినిమా: టాలీవుడ్‌లో ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. మొన్నటికి మొన్న విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న సీక్రెట్‌గా పెళ్లి చేసుకుని అందరికీ షాకివ్వగా, ఆ తర్వాత అల్లు శిరీష్ తన ప్రియురాలిని పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడయ్యాడు. ఇప్పుడు ఇదే బాటలో మరో యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas) కూడా పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమయ్యాడు. గత మూడు రోజులుగా వినిపిస్తున్న వార్తలను నిజం చేస్తూ, నేడు మార్చి 8న హైదరాబాద్‌లో శ్రీనివాస్ నిశ్చితార్థం సీక్రెట్‌గా జరిగింది. బెల్లంకొండ శ్రీనివాస్ మనసు దోచుకున్న ఆ అమ్మాయి పేరు కావ్య రెడ్డి( Kavya Reddy). ఈమెకు సినీ ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేదు. కావ్య ఒక ప్రతిష్టాత్మకమైన కుటుంబం నుండి వచ్చినట్లు తెలుస్తోంది. ఆమె తాతగారు జడ్జిగా పని చేయగా, తండ్రి ప్రముఖ లాయర్ అని సమాచారం.

వీరిద్దరి నిశ్చితార్థం కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య చాలా సింపుల్‌గా జరిగింది. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో లీక్ అయి నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఒకవైపు అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నా, మరోవైపు నెటిజన్ల మధ్య రకరకాల చర్చలు నడుస్తున్నాయి. అంతా సవ్యంగా ఉన్నప్పుడు ఇంత సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని కొందరు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై బెల్లంకొండ ఫ్యామిలీ నుండి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. పెళ్లి డేట్‌ను గ్రాండ్‌గా అనౌన్స్ చేస్తారా లేక పెళ్లి కూడా ఇలాగే సీక్రెట్‌గా కానిచ్చేస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా బెల్లంకొండ శ్రీనివాస్ ఒక ఇంటివాడు కాబోతుండటంతో అటు ఫ్యామిలీలోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ సందడి మొదలైంది.

link

Next Story