- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి తేదీ ఫిక్స్.. ఇదెక్కడి ట్విస్ట్ స్వామీ అంటూ నెటిజన్ల కామెంట్స్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన ప్రియురాలు కావ్య పెళ్లి తేదీ ఫిక్స్ అయినట్లు సమాచారం.

దిశ, సినిమా: టాలీవుడ్‌లో ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. యంగ్ హీరోలు వరుసగా బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పేస్తూ ప్రేమించిన వారితో ఏడడుగులు వేస్తున్నారు. ఇటీవల విజయ్, దేవరకొండ, రష్మిక ప్రేమ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అలాగే అల్లు శిరీష్ కూడా తన ప్రియురాలు నయనిక పెద్దల సమక్షంలో ఒక్కటయ్యారు. ఇక ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన ప్రియురాలు కావ్యను త్వరలోనే పెళ్లాడబోతున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల ఆయన కావ్యను సోషల్ మీడియాలో పరిచయం చేయడంతో అది నిశ్చితార్థం అని అందరూ భావించారు. కానీ, అది కేవలం పరిచయం మాత్రమేనని, అసలైన వేడుకలు ఇప్పుడే మొదలవ్వబోతున్నాయని క్లారిటీ ఇచ్చారు. తాజా సమాచారం ప్రకారం, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ - కావ్యల నిశ్చితార్థం ఏప్రిల్ 5న ఘనంగా జరగనుంది. ఆ వెంటనే ఏప్రిల్ 29న వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారని టాక్.
అయితే, టాలీవుడ్ సెలబ్రిటీలందరూ విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్స్ అంటూ హంగామా చేస్తుంటే, సాయి శ్రీనివాస్ మాత్రం అందుకు భిన్నంగా తిరుపతిలో చాలా సింపుల్‌గా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడం విశేషం. కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది. ఇక తిరుపతిలో పెళ్లి ముగిసిన తర్వాత, మే 1న హైదరాబాద్‌లో టాలీవుడ్ సినీ ప్రముఖుల కోసం ఒక భారీ రిసెప్షన్‌ను ఏర్పాటు చేయనున్నారు. సినీ ఇండస్ట్రీలోని పెద్దలందరినీ ఈ వేడుకకు ఆహ్వానించనున్నారట. నిన్న మొన్నటి వరకు విజయ్ దేవరకొండ, అల్లు శిరీష్ పెళ్లిళ్ల ముచ్చట్లతో బిజీగా ఉన్న నెటిజన్లు, ఇప్పుడు సాయి శ్రీనివాస్ పెళ్లి వార్త విని "ఇదేం సడెన్ ట్విస్ట్ సామీ!" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా బెల్లంకొండ వారసుడు కూడా ఒక ఇంటివాడు కాబోతుండటంతో బెల్లంకొండ అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.






