- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రేమలో మోసపోయా.. అదొక భయంకరమైన అనుభవం అంటూ శనయా కపూర్ ఎమోషనల్ కామెంట్స్
బాలీవుడ్ యంగ్ బ్యూటీ శనయా కపూర్ (Shanaya Kapoor)తన గతాన్ని తలచుకుంటూ ఒక షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది.

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ శనయా కపూర్ (Shanaya Kapoor)తన గతాన్ని తలచుకుంటూ ఒక షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ భామ ప్రేమించిన వ్యక్తి తనను ఎలా మోసం చేశాడో, ఆ చేదు అనుభవం తనను ఎంతలా కలచివేసిందో వెల్లడించి ఎమోషనల్ అయింది. తన బాయ్‌ఫ్రెండ్ ఒకేసారి ఐదుగురు అమ్మాయిలతో ఛాటింగ్ చేస్తూ దొరికిపోవడంతో షాక్ అయినట్లు తెలిపింది. ఒకప్పుడు తాను ఓ వ్యక్తితో పీకల్లోతు ప్రేమలో ఉండగా.. కలిసి వెకేషన్‌కు వెళ్లానని అప్పుడే అసలు నిజాలు బయటపడ్డాయని చెప్పింది. ‘‘ఆ సమయంలో మా మధ్య అంతా బాగుంది. ఇదే నా జీవితంలో పర్ఫెక్ట్ రిలేషన్ అని, ఇంతకంటే మంచి జీవితం ఉండదని మురిసిపోయాను. కానీ అది నిజం కాదని తెలియడానికి ఎంతో సమయం పట్టలేదు’’ అని ఆమె చెప్పుకొచ్చింది.
ఒకేసారి ఐదుగురితో చాటింగ్..
తన బాయ్‌ఫ్రెండ్ అసలు రూపం ఎలా తెలిపోయిందో చెప్తూ.. ‘‘వెకేషన్‌లో ఉండగా ఒకరోజు రాత్రి డిన్నర్‌కు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నాం. అప్పుడు క్యాబ్ బుక్ చేయమనినా ప్రియుడు చెప్పాడు. నా ఫోన్‌లో ఛార్జింగ్ లేకపోవడంతో, అతని ఫోన్ తీసుకుని క్యాబ్ బుక్ చేయబోయాను. సరిగ్గా అదే సమయంలో అతని ఎక్స్-గర్ల్‌ఫ్రెండ్ వచ్చింది. అనుమానం వచ్చి ఆ చాట్ ఓపెన్ చేయగా, అందులో అత్యంత అసభ్యకరమైన మెసేజ్‌లు నాకు కనిపించాయి. ఒకటి తర్వాత ఒకటి.. అలా ఐదుగురు అమ్మాయిలతో అతను మెసేజ్‌లు చేస్తున్నాడు. వారందరితోనూ తాను సింగిల్‌గా ఉన్నట్లు నమ్మిస్తూ అసభ్యంగా మాట్లాడుతున్నాడు. ఆ క్షణం నాకు చాలా భయం వేసింది. నా జీవితంలో అది అత్యంత భయంకరమైన అనుభవం’’ అని శనయా ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






