'పుష్ప' సక్సెస్‌కు కారణం రాజమౌళి.. సీక్రెట్ చెప్పిన సుకుమార్

by Disha Web Desk 13 |
పుష్ప సక్సెస్‌కు కారణం రాజమౌళి.. సీక్రెట్ చెప్పిన సుకుమార్
X

దిశ, సినిమా: రీసెంట్‌గా తమిళనాడు ముఖ్యమంత్రి M. K. స్టాలిన్ 'కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII)', దక్షిణ్ – సౌత్ ఇండియా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్‌ను ప్రారంభించారు. ముఖ్యఅతిథులుగా SS రాజమౌళి, మణిరత్నం, సుకుమార్ వంటి అగ్ర దర్శకులు హాజరయ్యారు. సినిమా ట్రెండ్, ఇండస్ట్రీ భవిష్యత్తు గురించి చర్చించారు. ఈ క్రమంలోనే ఒక విషయం బయటపడింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'పుష్ప' మూవీ హిట్‌‌‌లో రాజమౌళి ప్రమేయం కూడా ఉన్నట్లుగా తెలిసింది.

విషయానికొస్తే.. సుకుమార్ ముందుగా 'పుష్ప'ను తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ 'RRR' మూవీ హిందీ ప్రమోషన్స్ టైమ్‌లో ఈ 'పుష్ప' మూవీ సాంగ్స్‌కు అక్కడున్న క్రేజ్ గుర్తించారంటా రాజమౌళి. దీంతో ఈ మూవీని హిందీలో కూడా రిలీజ్ చేయాలని సలహా ఇచ్చారు. దీంతో 'పుష్ప'ను పాన్ ఇండియా సినిమా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు సుకుమార్ అండ్ టీమ్. ఆ విధంగా అన్ని భాషల్లో రిలీజ్ అయిన సినిమా బాక్సాఫీసును షేక్ చేసింది.

Next Story

Most Viewed