విడుదలకుముందే ఉత్కంఠ రేపుతున్న ‘పుష్ప 2’.. నార్త్ ప్రేక్షకులు వేయిటింగ్

by Disha Web Desk 7 |
విడుదలకుముందే ఉత్కంఠ రేపుతున్న ‘పుష్ప 2’.. నార్త్ ప్రేక్షకులు వేయిటింగ్
X

దిశ, సినిమా: ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ సర్వేయింగ్ కంపెనీ ‘ఓర్ మాక్స్ సినిమాటిక్’ ఇటీవల తన మోస్ట్ అవైటెడ్ హిందీ చిత్రాల జాబితాను విడుదల చేసింది. కాగా టాప్‌లో ఏ హీరో ఉన్నాడు? ఏ మూవీ ఉందో మీరు అస్సలు ఊహించలేరు. హిందీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘పుష్ప-2’ అనీ ఈ సర్వేలో తేలింది. అయితే 2023లో విడుదల కాబోతున్న అక్షయ్ కుమార్ ‘హేరా ఫేరీ 4’, షారుఖ్ ‘జవాన్’, సల్మాన్ ‘టైగర్ 3’ వంటి బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు ఉన్నప్పటికి అక్కడి ప్రేక్షకులు 2024లో రాబోతున్న ‘పుష్ప 2’ కోసం ఎదురుచూస్తున్నారట. అలాగే ఇటీవల విడుదలైన టీజర్, అర్జున్ కాళీ దేవి లుక్ నార్త్ ప్రేక్షకులను అట్రాక్ట్ చేశాయని టాక్ వినిపిస్తోంది.

Also Read..

‘ఉగ్రం’ ట్రైలర్.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన అల్లరి నరేష్



Next Story

Most Viewed