‘బీఫ్ తినేవాడు రాముడిగా నటిస్తున్నాడు’.. అతడికి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ చిన్మయి సెన్సేషనల్ ట్వీట్

by Mallepaka Hamsa |

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor), సాయి పల్లవి(Sai Pallavi) జంటగా నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ ‘రామాయణ’(Ramayana).

‘బీఫ్ తినేవాడు రాముడిగా నటిస్తున్నాడు’.. అతడికి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ చిన్మయి సెన్సేషనల్ ట్వీట్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor), సాయి పల్లవి(Sai Pallavi) జంటగా నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ ‘రామాయణ’(Ramayana). ఇందులో స్టార్ హీరో యశ్ రావణుడి పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. నితీష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలను నెలకొన్నాయి. హన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ బీజిఎంలు,విజువల్స్ అందిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది దీపావళి కానుకగా విడుదల కాబోతుంది. ఈనేపథ్యంలో.. ఇటీవల మూవీ మేకర్స్ ‘రామాయణ’ గ్లింప్స్ విడుదల చేసి సినీ ప్రియులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు.

ఈనేపథ్యంలో.. ఓ నెటిజన్ రణ్‌బీర్ రాముడి పాత్రలో కనిపించడంపై షాకింగ్ ట్వీట్ పెట్టాడు. ‘‘బీఫ్ తినేవాడు రాముడి పాత్ర పోషించడమేంటి? మన కర్మ’’ అని రాసుకొచ్చాడు. ఇక ఈ పోస్ట్ కాస్త సింగర్ చిన్మయి కంట పడటంతో ఈ విషయంపై సెన్సేషనల్ ట్వీట్ పెట్టింది. ‘‘దేవుడి పేరుతో ఓ బాబాజీ రేప్ చేస్తాడు. జైల్లో నుంచి బయటకు వచ్చి ఎన్నికల్లో ఓట్లు కూడా సంపాదించి గెలవొచ్చు. ఇదే భక్తి ఇండియా. అలాంటప్పుడు ఎవరో ఏదో తిన్నారంటే అదేం పెద్ద సమస్య కాదుగా.

ఒక రెపిస్ట్ ఎంపీ గెలిస్తే మీకు ఏం అనిపించడం లేదా’’ అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. అలాగే ఈ మ్యాటర్‌లో దూరకండి అని ఓ నెటిజన్ అనగా.. దానికి చిన్మయి.. ‘‘దేవుడి పేరుతో అటెన్షన్ అందిపుచ్చుకునే వాళ్లు ఎలా నాశనం అవుతున్నారో చూస్తూనే ఉన్నాం’’ అని రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం చిన్మయి ట్వీట్లు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఇక ఈ విషయం గురించి తెలుసుకున్న నెటిజన్లు కొందరు ఆమెకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు.

link

Next Story