ఆ స్టార్ హీరోయిన్ కారణంగా.. చరణ్, ఉపాసన విడిపోదాం అని ఫిక్స్ అయ్యారా..?

by Mallepaka Hamsa |   (  Updated:2023-05-25 10:03:28  IST  )

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్వరలో తండ్రి కాబోతున్నారు.

ram charan- upasana
X

దిశ, సినిమా: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్వరలో తండ్రి కాబోతున్నారు. ఆయన సతీమణి ఉపాసన ఆగస్టు చివర్లో లేదా సెప్టెంబర్ లో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతుంది. పెళ్లి అయ్యాక దాదాపు పదకొండేళ్ల తర్వాత ఈ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు. దీంతో ప్రస్తుతం అందరి చూపు వాళ్ళ మీదనే ఉంది. ఇక పోతే భార్యాభర్తల మధ్య గొడవలు కామన్ అయితే చరణ్, ఉపాసన మధ్య కూడా ఒక చిన్నపాటి యుద్ధమే అయిందట. ఏకంగా విడాకులు తీసుకునేంత దాకా వెళ్లిందని టాక్. అది కూడా ఓ హీరోయిన్ కారణంగా. అవును రామ్ చరణ్ హీరోయిన్ కాజల్ తో అతిగా రొమాన్స్ చేయడం ఉపాసనకి అస్సలు నచ్చలేదట. కాజల్ తో కలిసి రామ్ చరణ్ మగధీర, నాయక్, గోవిందుడు అందరివాడేలే వంటి సినిమాల్లో నటించింది. ‘గోవిందుడు అందరివాడేలే’ మూవీలో వీరిద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్ చాలా ఉన్నట్లు తెలుస్తోంది. దాని కారణంగా ఉపాసన, చెర్రీ మధ్య గొడవలు జరిగాయని తెలుస్తోంది.

Read more:

Anasuya Bharadwaj :అనసూయకు ఈ మధ్యన బట్టలే బరువైపోతున్నాయంటున్న నెటిజన్లు

‘UV మెగా పిక్చర్స్’ పేరుతో నిర్మాణ సంస్థ స్టార్ట్ చేసిన రామ్ చరణ్

Next Story