- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘అర్జున్ చక్రవర్తి' నుంచి బ్యూటిఫుల్ సాంగ్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న లిరికల్ వీడియో
విజయ రామరాజు(Vijaya Rama Raju) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అర్జున్ చక్రవర్తి’(Arjun Chakravarthy).

దిశ, సినిమా: విజయ రామరాజు(Vijaya Rama Raju) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అర్జున్ చక్రవర్తి’(Arjun Chakravarthy). విక్రాంత్ రుద్ర (Vikrant Rudra)దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీని గుబ్బల నిర్మిస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా రాబోతున్న ఈ మూవీని ఓ కబడ్డీ ఆటగాడి నిజ జీవితం ఆధారంగా తీసుకురాబోతున్నారు. ఈ చిత్రంలో హర్ష్ రోషన్, అజయ్, అజయ్ ఘోష్, దయానంద్ రెడ్డి కీలక పాత్రలు కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు 46 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వచ్చాయి. ఇటివలే రీలీజైన్ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. టీజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో 16 మిలియన్ల వ్యూస్ తెచ్చుకుంది.
యూట్యూబ్ లో 1.5 మిలియన్ల వ్యూస్ దాటింది. అలాగే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ కూడా మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. దీంతో మూవీ మేకర్స్ మ్యూజికల్ జర్నీ ప్రారంభించారు. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేశారు. ‘మేఘం వర్షించదా’ అనే సాగే ఈ పాటతో మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. విఘ్నేష్ బాస్కరన్ ఈ బ్యుటీఫుల్ లవ్ సాంగ్‌ను కంపోజ్ చేశారు. విక్రాంత్ రుద్ర రాసిన లిరిక్స్ మనసుని హత్తుకునేలా ఉన్నాయి. కపిల్ కపిలన్, మీరా ప్రకాష్ , సుజిత్ శ్రీధర్ తమ మ్యాజికల్ వాయిస్‌తో కట్టిపడేశారు. ఈ సాంగ్‌లో విజయరామరాజు, సిజా రోజ్ కెమిస్ట్రీ లవ్లీగా ఉంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.






