'విష్ణు విన్యాసం' నుంచి బ్యూటీఫుల్ లవ్ సాంగ్ మొదలే మొదలే రిలీజ్

by Mallepaka Hamsa |

బ్యూటీఫుల్ లవ్ మెలోడీ మొదలే మొదలే సాంగ్ రిలీజ్.

విష్ణు విన్యాసం నుంచి బ్యూటీఫుల్ లవ్ సాంగ్ మొదలే మొదలే రిలీజ్
X

దిశ, సినిమా: కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ విష్ణు(Sri Vishnu) ‘విష్ణు విన్యాసం’ (Vishnu Vinyasam)అనే యూనిక్ ప్రాజెక్ట్‌తో అలరించబోతున్నారు. నూతన దర్శకుడు యదునాథ్ మారుతి రావు (Yadunath Maruti Rao)ఈ చిత్రానికి దర్శకత్వం. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి నిర్మించిన ఈ చిత్రాన్ని హేమ, షాలిని సమర్పిస్తున్నారు. ఇక ఇటీవల విడుదలైన టైటిల్ గ్లింప్స్‌, ఫస్ట్ సింగిల్ 'దేఖో విష్ణు విన్యాసం'కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా, మేకర్స్ సెకండ్ సింగిల్ ‘మొదలే మొదలే’ సాంగ్ రిలీజ్ చేశారు. సంగీత దర్శకుడు రధన్ ఈ సాంగ్ ని బ్యూటీఫుల్ లవ్ మెలోడీగా కంపోజ్ చేశారు. ఈ సాంగ్ లో శ్రీ విష్ణు, నయన సారిక కెమిస్ట్రీ లవ్లీగా ఆకట్టుకుంది. వాలెంటైన్స్ డే కి పర్ఫెక్ట్ గిఫ్ట్‌గా నిలిచే ఈ సాంగ్ ఇన్‌స్టంట్ హిట్‌గా అలరిస్తోంది. ఈ చిత్రంలో సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్, మురళి శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వరలోనే థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.



Next Story