బీస్ట్ మోడ్ ఆన్.. ‘మైసా’ కోసం రోజుకు 8గంటల కఠిన శిక్షణ.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు

by Mallepaka Hamsa |

రష్మిక ప్రస్తుతం బ్యాంకాక్‌లో మకాం వేసింది. రోజుకు ఏకంగా 8 గంటల పాటు అంతర్జాతీయ స్థాయి స్టంట్ మాస్టర్ల నేతృత్వంలో మార్షల్ ఆర్ట్స్, స్టంట్ టెక్నిక్స్‌లో శిక్షణ పొందుతోందని సమాచారం.

బీస్ట్ మోడ్ ఆన్.. ‘మైసా’ కోసం రోజుకు 8గంటల కఠిన శిక్షణ.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: నేషనల్ క్రష్ రష్మిక మందన్న, రౌడీ హీరో విజయ్ దేవరకొండల వివాహ వేడుక ముగిసిందో లేదో, అప్పుడే ఈ స్టార్ కపుల్ తమ వర్క్‌లో మునిగిపోయారు. పెళ్లి తర్వాత హీరోయిన్ల కెరీర్ స్లో అవుతుందనే అంచనాలను రష్మిక పటాపంచలు చేస్తోంది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న భారీ లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘మైసా’ కోసం రష్మిక ఏకంగా బీస్ట్ మోడ్ ఆన్ చేసింది. విరామం లేకుండా తనను తాను శారీరకంగా, మానసిక సిద్ధం చేసుకుంటూ వెండితెరపై ఒక అద్భుత పోరాటాన్ని చూపించడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమాలో రష్మిక ఒక ధైర్యవంతురాలైన గోండు మహిళగా కనిపిస్తోంది. గిరిజన ప్రాంత నేపథ్యం కావడంతో, యుద్ధ సన్నివేశాలు చాలా సహజంగా, పవర్‌ఫుల్‌గా ఉండాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇందుకోసం రష్మిక ప్రస్తుతం బ్యాంకాక్‌లో మకాం వేసింది. రోజుకు ఏకంగా 8 గంటల పాటు అంతర్జాతీయ స్థాయి స్టంట్ మాస్టర్ల నేతృత్వంలో మార్షల్ ఆర్ట్స్, స్టంట్ టెక్నిక్స్‌లో శిక్షణ పొందుతోందని సమాచారం.

అండి లాంగ్, జైకా స్టంట్ టీమ్ ఆమెకు శిక్షణ ఇస్తుండటంతో, సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ నెక్స్ట్ లెవల్‌లో ఉండబోతున్నాయని అర్థమవుతోంది. తాజాగా, రష్మిక ట్రైనింగ్ సెషన్స్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఈ ఫోటోల్లో ఒక ఆసక్తికరమైన విషయం అందరినీ ఆకట్టుకుంటోంది. కఠినమైన వర్కౌట్స్, స్టంట్స్ చేస్తున్నప్పటికీ, రష్మిక తన మెడలో తాళిబొట్టు, మెట్టెలు ధరించి ఉండటం నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. సాధారణంగా సెలబ్రిటీలు పెళ్లయ్యాక ఇలాంటి వస్తువులను షూటింగ్స్ లేదా వర్కౌట్స్ అప్పుడు పక్కన పెడతారు, కానీ రష్మిక తన పద్ధతులను పాటిస్తూనే కెరీర్ పట్ల అంకితభావంతో ఉండటం చూసి అందరూ ప్రశంసిస్తున్నారు.పెళ్లి తర్వాత రష్మిక జోరు తగ్గకపోగా, మరింత పెరిగినట్లు కనిపిస్తోంది. రౌడీ వైఫ్ చూపిస్తున్న ఈ తెగువ చూస్తుంటే, ‘మైసా’ చిత్రం రష్మిక కెరీర్‌లోనే బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా నిలిచే అవకాశం ఉంది. ఒకవైపు సంసార జీవితాన్ని, మరోవైపు కెరీర్‌ను బ్యాలెన్స్ చేస్తున్న రష్మికను చూసి అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Next Story