బాస్టియన్ లెక్కలేనన్ని జ్ఞాపకాలు అందించింది.. శిల్పా శెట్టి ఎమోషనల్ నోట్ వైరల్.. అసలేం జరిగిందంటే?

by Mallepaka Hamsa |

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి (Shilpa Shetty)నిత్యం వార్తల్లో నిలుస్తోంది.

బాస్టియన్ లెక్కలేనన్ని జ్ఞాపకాలు అందించింది.. శిల్పా శెట్టి ఎమోషనల్ నోట్ వైరల్.. అసలేం జరిగిందంటే?
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి (Shilpa Shetty)నిత్యం వార్తల్లో నిలుస్తోంది. రూ. 60 కోట్లు మోసం చేశారని శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా(Raj Kundra)పై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన ఓ స్వామిజీకి కిడ్నీ దానం చేస్తానని చెప్పడంతో విమర్శలు వచ్చాయి. ఈ జంటపై నిత్యం ట్రోల్స్ వస్తున్నాయి. ఈక్రమంలో.. తాజాగా, శిల్పా శెట్టి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ షాకింగ్ పోస్ట్ పెట్టింది. ముంబైలోని తన ‘బాస్టియన్’ రెస్టారెంట్‌(Bastian Restaurant)ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ‘‘ముంబయిలో ‘బాస్టియన్’ పేరుతో ఉన్న మా రెస్టారెంట్ ఎంతో ఆదరణ సొంతం చేసుకుంది. లెక్కలేనన్ని జ్ఞాపకాలను అందించింది. ఎన్నో మర్చిపోలేని క్షణాలను ఇచ్చింది. ఎన్నో ఆనందాలనను మాకు పంచిన ఆ వేదిక ఒకపై మూతపడనుంది. చివరిసారిగా గురువారం నాడు ఓ వేడుక నిర్వహిస్తున్నాం. ఇందులో వ్యాపారవేత్తలు, సన్నిహితులు ఈ వేడుకకు హాజరు కాబోతున్నారు. త్వరలోనే మరో కొత్త అనుభవాలతో మీ ముందుకువస్తాము’’ అని రాసుకొచ్చింది. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఆ రూ. 60 కోట్లు కట్టడానికే మూసివేసి అమ్ముతున్నారా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.




Next Story