బిగ్ బాస్ సీజన్‌ 7లో బ్యాంకాక్ పిల్ల.. క్లారిటీ ఇచ్చిన శ్రావణి

by Disha Web Desk 12 |
బిగ్ బాస్ సీజన్‌ 7లో బ్యాంకాక్ పిల్ల.. క్లారిటీ ఇచ్చిన శ్రావణి
X

దిశ, వెబ్‌డెస్క్: యూట్యూబ్‌లో బ్యాంకాక్ అందాలు, అక్కడి పరిస్థితులను, తన జీవన విధానాన్ని పంచుకుంటూ.. ఫెమస్ అయిన యూట్యూబర్ (బ్యాంకాక్ పిల్ల శ్రావణి సామంతపూడి. ఈమె గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర్లేదు. యూట్యూబ్‌లో రెండు మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉన్న శ్రావణి( బ్యాంకాక్ పిల్ల) బిగ్ బాస్ 7వ సీజన్ లో పాల్గొంటున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన శ్రావణి తన కుటుంబ సభ్యులతో ఆమె బిగ్ బాస్‌లో పాల్గొనాలా వద్దా అనే దానిపై వారి అభిప్రాయాలను కోరింది. అలాగే చాలా చర్చల తర్వాత, ఆమె తల్లిగా తన బాధ్యతలు నిర్వహించాలని.. షో కారణంగా తాను పిల్లలకు ఎక్కువ కాలం దూరం కావాల్సిన పరిస్థితులు వస్తాయి కాబట్టి.. తాను బిగ్ బాస్ 7 లో పాల్గొనడం లేదని తన నిర్ణయాన్ని ప్రకటించింది. అలాగే తన నిర్ణయంతో ఎమైన మార్పులు ఉంటే తానే చెబుతానని.. తప్పుడు వార్తలను ఎవ్వరు నమ్మవద్దని ఆమె తెలిపింది.



Next Story

Most Viewed