పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు బండ్ల గణేశ్ బర్త్ డే గిఫ్ట్

by Disha Web Desk 2 |
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు బండ్ల గణేశ్ బర్త్ డే గిఫ్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ హాస్య నటుడు బండ్ల గణేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం కామెడీతోనే కాకుండా ప్రొడ్యూసర్‌గా కూడా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. పవర్ స్టార్‌తో గబ్బర్ సింగ్ లాంటి సెన్సేషన్ సినిమా తీసి బాక్సాఫీస్‌ను షేక్ చేశారు. అంతేగాక, నిత్యం సోషల్ మీడియా వేదికగా పవన్ కల్యాణ్ గురించి ఏదో ఒక పోస్టు పెడుతూ అభిమానుల్లో జోష్ నింపుతున్నాడు. తాజాగా.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా బండ్ల గణేశ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇటీవల బండ్ల గణేశ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం డేగల బాబ్జీ. అయితే, సెప్టెంబర్ 2వ తేదీన పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా టీవీల్లో ప్రసారం చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు కూడా పెట్టారు. ''సెప్టెంబర్ 2న దేవర జన్మదినం సందర్భంగా మీ ఇంట్లో.. మీ కోసం డేగల బాబ్జి తప్పక చూడండి. ఆశీర్వదించండి. మీ బండ్ల.'' అంటూ పేర్కొ్న్నారు.

Also Read : పవర్ స్టార్ కోసం హీరో నిఖిల్ త్యాగం.. ఆకాశానికెత్తేస్తోన్న పవన్ ఫ్యాన్స్

Next Story