ఆదిపురుష్ సినిమాను వెంటనే బ్యాన్ చేయండి: ప్రధాని మోడీకి లేఖ

by Disha Web Desk 7 |
ఆదిపురుష్ సినిమాను వెంటనే బ్యాన్ చేయండి: ప్రధాని మోడీకి లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ‘ఆదిపురుష్’ సినిమా అనేక విమర్శలు ఎదుర్కొంటుంది. విడుదలైన 4 రోజులకే భారీ కలెక్షన్‌లు వస్తున్నప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద మిక్సిడ్ టాక్ సొంతం చేసుకుని యావరేజ్‌గా నడుస్తుంది. ఇక సినిమాను బ్యాన్ చేయాలని ఇప్పటికే చాలా మంది డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరోసారి ఈ సినిమాకు భారీ షాక్ తగిలింది.

ఈ మూవీని బ్యాన్ చేయడమే కాకుండా.. OTT లోకి కూడా విడుదల చేయొద్దంటూ ఏకంగా ప్రధాని మోడీకి లేఖ రాశారు ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్. ఈ మేరకు ‘‘ఆదిపురుష్ సినిమా ప్రదర్శనను వెంటనే బ్యాన్ చేయాలి. ఈ మూవీ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాముడు, హనుమంతుడి గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి. వెంటనే థియేటర్లలో ఈ సినిమాను నిషేధించండి. భవిష్యత్తులో OTT లోనూ విడుదల చేయొద్దు. అలాగే డైరెక్టర్ ఓం రౌత్, రచయిత మనోజ్ శుక్లాపై FIR నమోదు చేయాలి’ అంటూ లేఖలో పేర్కొంది.




Read more: Salaar teaser : ప్రభాస్ 'సలార్' టీజర్‌పై తాజా అప్‌డేట్



Next Story