బాలయ్య సూపర్ హిట్ మూవీ ‘Bhairava Dweepam’ రీ రిలీజ్ ట్రైలర్ విడుదల

by Disha Web Desk 6 |
బాలయ్య సూపర్ హిట్ మూవీ ‘Bhairava Dweepam’ రీ రిలీజ్ ట్రైలర్ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ, ప్రముఖ దర్శకుడు శ్రీనివాసరావు కాంబినేషన్‌లో 1994లో వచ్చిన చిత్రం ‘భైరవ ద్వీపం’. ఇందులో రోజా హీరోయిన్‌గా నటించింది. బాలయ్య కెరీర్‌లోనే ఓ మైలురాయిగా నిలిచిన చిత్రాల్లో ఒకటి ‘భైరవద్వీపం’. ఈ చిత్రం 9 నంది అవార్డులను సాధించింది. అంతేకాకుండా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని, ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణను దక్కించుకుంది. అయితే ఇండస్ట్రీకి స్టార్ హీరోల సినిమాలు ఇప్పుడు రీరిలీజ్‌ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో బాలకృష్ణ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా ‘భైరవ ద్వీపం’ సినిమాను ఆగస్టు 30న రీరిలీజ్‌ చేయనున్నారు. తాజాగా, దీనికి సంబంధించిన 4k ట్రైలర్‌ చిత్రయూనిట్ విడుదల చేశారు. ట్రైలర్ కూడా చాలా బాగా కట్ చేసి వదలడంతో మంచి రెస్పాన్స్ వస్తోంది. రీరిలీజ్‌లో కూడా కలెక్షన్స్‌తో బాక్సాఫీసును బద్దలు కొడుతుందని బాలయ్య ఫ్యాన్స్ అంటున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలయ్య, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘భగవంత్ కేసరి’. ఈ చిత్రం అక్టోబర్ 19, 2023 న విడుదల కానుంది.

Also Read: ఈ విజయం నాలాంటి వారెందరికో స్ఫూర్తి.. అచ్చం డైరీలో రాసుకున్నట్లే జరిగింది

Next Story