తమిళ సినిమాల మీదే ఆసక్తి చూపిస్తున్న టాలీవుడ్ నిర్మాతలు.. ఎందుకో తెలుసా?

by Dishaweb |
తమిళ సినిమాల మీదే ఆసక్తి చూపిస్తున్న టాలీవుడ్ నిర్మాతలు.. ఎందుకో తెలుసా?
X

దిశ, సినిమా: ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌‌కు చెందిన బడా నిర్మాతలు తమ సొంత సినిమా థియేటర్స్‌లోకి తమిళం, ఇతర డబ్బింగ్ సినిమాలు తీసుకురావడం మొదలెట్టారు. స్టార్ హీరోల చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా తమిళ మూవీని తెలుగులో రిలీజ్ చేస్తూ తలనొప్పి చేస్తున్నారు. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అవుతుంది. విషయమేమిటంటే.. కనగరాజ్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘లియో’ అక్టోబర్ 19న విడుదల కానుంది. కాగా ఈ సినిమాను తెలుగులో ఒక పెద్ద నిర్మాత అక్టోబర్ 20న విడుదల చేయడానికి చర్చలు జరుపుతున్నారు. అయితే దీంతో పాటుగా బాలయ్య, అనిల్ రావిపూడి మూవీ, అలాగే రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’, రామ్ పోతినేని, బోయపాటి సినిమా కూడా అదే టైంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక వరుసగా తెలుగు పెద్ద చిత్రాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నప్పటికి బడా నిర్మాతలు తమిళ మూవీస్ మీద ఆసక్తి చూపిస్తున్నారు.

Also Read: ‘ఆర్ఆర్ఆర్’ చూసి ఫిదా అయ్యాను.. టామ్ హాలండ్

షారుఖ్ రొమాన్స్ చూస్తూ ఇలా తయారయ్యాను.. అమెరికన్ నటి



Next Story

Most Viewed