స్టేజ్‌పై అందరిముందు సుమను అవమానించిన బాలయ్య!

by Disha Web Desk 9 |
స్టేజ్‌పై అందరిముందు సుమను అవమానించిన బాలయ్య!
X

దిశ, వెబ్‌డెస్క్: జగపతిబాబు ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘రుద్రంగి’ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించగా.. బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే యాంకర్ సుమ అతిథుల్ని వేదికపైకి ఆహ్వానిస్తూ.. ఒక్కొక్కరి గురించి నాన్‌స్టాప్‌గా మాట్లాడుతుంది. ఇంతలో జగపతి బాబు ప్రసంగించడానికి రెడీ అయ్యారు. కానీ సుమ ఆయనకు మైక్ ఇవ్వకుండా జగపతిబాబును పొగిడే కార్యక్రమం పెట్టుకుంది. దీంతో పక్కనే ఉన్న బాలయ్య.. ‘‘అహే ఆపు.. లొడలొడా వాగేస్తున్నావ్’’ అంటూ సరదాగా ఆమెపై అరిచారు. దీనితో సుమ ముఖం ఒక్కసారిగా బిత్తరపోయింది. బాలయ్య అన్న మాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: నేను సెక్సీ ఏంటి? మమతా మోహన్ దాస్ ఫీల్ అవుతారు.. బాలయ్య కామెంట్స్ వైరల్


Next Story

Most Viewed