బాయ్‌ఫ్రెండ్‌తో అడ్డంగా దొరికిపోయిన బాలయ్య బ్యూటీ.. హాట్ టాపిక్‌గా మారిన పోస్ట్.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు

by Mallepaka Hamsa |

బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా(Urvashi Rautela) 15ఏళ్ల వయసులోనే మోడలింగ్‌ను ప్రారంభించింది.

బాయ్‌ఫ్రెండ్‌తో అడ్డంగా దొరికిపోయిన బాలయ్య బ్యూటీ.. హాట్ టాపిక్‌గా మారిన పోస్ట్.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా(Urvashi Rautela) 15ఏళ్ల వయసులోనే మోడలింగ్‌ను ప్రారంభించింది. 2009లో టైటిల్ గెలుచుకోవడంతో పాటు మిస్ యూనివర్స్ ఇండియా కప్‌ను కూడా దక్కించుకుంది. ఇక నటనపై ఆసక్తితో సినిమా ఇండస్ట్రీకి వచ్చింది. మొదటిగా ఈ అమ్మడు స్పెషల్ సాంగ్స్ చేసి ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకుంది. ఆ తర్వాత ‘సాబ్ ది గ్రేట్’ మూవీలో హీరోయిన్‌గా నటించింది. తనకంటే వయసులో పెద్దవాడైన నటుతో లిప్‌లాక్, రొమాంటిక్ సీన్స్‌లో రెచ్చిపోయి నటించినప్పటికీ ఊహించినంత పాపులారిటీ రాబట్టుకోలేకపోయింది. ఇక తెలుగులో ఊర్వశి ఏజెంట్, స్కంద, బ్రో వంటి చిత్రాల్లో ఐటెం సాంగ్స్ చేసింది. అలాగే ఇటీవల బాలకృష్ణ(Balakrishna) నటించిన ‘డాకు మహారాజ్’ (daaku maharaj)మూవీలో ఐటెం సాంగ్‌లో ఆడిపాడి విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంది.

ఊర్వశి రౌటేలా ఓ వైపు టాలీవుడ్, బాలీవుడ్ చిత్రాల్లో ఐటెం సాంగ్స్ చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం పలు గ్లామరస్ ఫొటోలు షేర్ చేస్తూ యువతను ఉర్రూతలూగిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఊర్వశి రౌటేలా తన బాయ్‌ఫ్రెండ్‌తో అడ్డంగా దొరికిపోయింది. వీరిద్దరు సన్నిహితంగా ఉన్న ఫొటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసి అందరినీ షాక్‌కు గురి చేసింది. వింబుల్డన్‌లో ఓ మిస్టరీ మ్యాన్‌తో ఊర్వశి కనిపించడం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఆ వ్యక్తి ముఖం కనిపించకుండా ఊర్వశి లవ్ సింబల్స్‌తో కప్పేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుండటంతో అవి చూసిన నెటిజన్లు ఆమె ప్రేమలో ఉందని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతుందంటూ కంగ్రాట్స్ చెబుతున్నారు.




Next Story