షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చిన బాలయ్య బాబు?

by Chukka Sudharani |   (  Updated:2023-02-13 12:59:07  IST  )

ప్రస్తుతం బాలయ్య చేతిలో వరుస ప్రాజెక్ట్‌లున్నాయి. అందులో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న 'NBK 108' చిత్రం కూడా ఒకటి.

షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చిన బాలయ్య బాబు?
X

దిశ, సినిమా: ప్రస్తుతం బాలయ్య చేతిలో వరుస ప్రాజెక్ట్‌లున్నాయి. అందులో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న 'NBK 108' చిత్రం కూడా ఒకటి. ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్ హీరోయిన్‌గా, శ్రీలీలా బాల‌య్య కూతురులా న‌టించింది. అయితే తాజా సమాచారం ప్రకారం బాలయ్య ప్రజెంట్ షూటింగ్ కాస్త బ్రేక్ ఇచ్చారట. కారణం ఏమిటంటే నందమూరి తారకరత్న ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాలయ్య దగ్గరుండి చూసుకుంటున్నాడట. ఈ క్రమంలో షూటింగ్‌లకు కాస్త బ్రేక్‌ ఇచ్చినట్లు తెలిసింది.

Next Story