Nandamuri Mokshagna :బాలయ్య- బోయపాటి మూవీ.. అతిథి పాత్రలో మోక్షజ్ఞ?

by Disha Web Desk 10 |
Nandamuri Mokshagna :బాలయ్య- బోయపాటి మూవీ.. అతిథి పాత్రలో మోక్షజ్ఞ?
X

దిశ,సినిమా: నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఇగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే సీనియర్ హీరోలు చిరంజీవి కొడుకు రామ్ చరణ్, నాగార్జున ఇద్దరు కొడుకులు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఆ మధ్య మోక్షజ్ఞ ఎంట్రీ ఈ ఏడాది ఉంటుందని బాలయ్య ప్రకటించారు. కానీ ఆ సినిమాకు దర్శకుడు ఎవరనేది ప్రకటించలేదు. కాగా ఇప్పుడు మరో కొత్త రూమర్ వినిపిస్తోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం బోయపాటి శ్రీను రామ్‌తో సినిమా చేస్తున్నాడు. ఈ ఏడాది ఆగస్టులోపు అది ఫినిష్ చేసి, తన నెక్ట్స్ మూవీ బాలయ్యతో తీయనుండగా.. ఇందులో మోక్షజ్ఞ గెస్ట్ రోల్ చేయబోతున్నాడని సమాచారం. దీని గురించి అధికారిక ప్రకటన రావాల్సివుంది.

Read more:

అలా చేస్తేనే అఖిల్ సక్సెస్ అవుతాడంట.. వేణు స్వామి షాకింగ్ కామెంట్స్

Sreemukhi: శ్రీముఖి రోజుకు ఎంత సంపాదిస్తుందో తెలుసా?

Next Story

Most Viewed