- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘బలగం’ మూవీ ట్విట్టర్ రివ్యూ.. తెలంగాణ యాసతో అదరగొట్టిన ప్రియదర్శి
నటుడు ప్రియదర్శి కమెడియన్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ‘మల్లేశం’ మూవీతో హీరోగా మారాడు..

దిశ, వెబ్ డెస్క్: నటుడు ప్రియదర్శి కమెడియన్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ‘మల్లేశం’ మూవీతో హీరోగా మారాడు. ప్రియదర్శి నటించిన తాజా చిత్రం ‘బలగం’. దీనికి హాస్యనటుడు వేణు యెల్దండి దర్శకత్వం వహించగా.. కావ్య కళ్యాణ్ రామ్ కథానాయికగా నటించింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ కాంపౌండ్‌లో ఆయన కుటుంబానికి చెందిన హర్షిత రెడ్డి, హన్షిత నిర్మించారు.
ఈ సినిమా మార్చి 3న గ్రాండ్‌గా విడుదలై ప్రేక్షకుల్లో పాజిటీవ్ టాక్‌ను సొంతం చేసుకుంది. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రానికి ఇదే ప్లస్ పాయింట్‌గా నిలిచింది. అంతేకాకుండా ప్రియదర్శి తెలంగాణ యాస భావోద్వేగ నటన, అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. కొన్ని సీన్స్ సాగదీతగా ఉండటం, ఊహించగలిగే కథ లేనందున దీనికి 2.75/5 రేటింగ్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి : Tollywood: టాలీవుడ్ స్టార్ హీరోల చూపులు ఆగస్ట్ వైపే ఉన్నాయి.. ఎందుకో తెలుసా?






