‘బలగం’ సినిమాకు రెండు అంతర్జాతీయ అవార్డులు

by Dishafeatures2 |
‘బలగం’ సినిమాకు రెండు అంతర్జాతీయ అవార్డులు
X

దిశ, వెబ్ డెస్క్: పల్లెటూరి పచ్చదనాన్ని, మానవ బంధాలను అద్భుతంగా చూపించిన బ‌ల‌గం సినిమాపై తెలుగు ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ రిలీజై 15 రోజులు కావొస్తున్నా సినిమాకు ఆదరణ ఏమాత్రం తగ్గడం లేదు. కాగా ఈ మూవీని తాజాగా రెండు అంతర్జాతీయ అవార్డులు వరించాయి. లాస్‌ ఏంజిల్స్‌ సినిమాటోగ్రఫీ అవార్డుల్లో ఈ మూవీ సత్తా చాటింది. బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌, బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ సినిమాటోగ్రఫీ కేటగిరీల్లో రెండు అవార్డులను గెలుచుకుంది. ఈ విషయాన్ని డైరెక్టర్ వేణు స్వయంగా సోషల్‌ మీడియాలో వెల్లడించారు.

‘ప్రతిష్టాత్మక లాస్‌ ఏంజిల్స్‌ సినిమాటోగ్రఫి అవార్డును గెలుచుకున్నందుకు మా సినిమాటోగ్రాఫర్‌ ఆచార్య వేణుకు అభినందనలు’ అని ట్విట్టర్‌లో ఫోటోలు పంచుకున్నారు. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్‌రామ్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాను దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్‌ రెడ్డి, హన్షితా రెడ్డి నిర్మించారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed