మురళిధర్ గౌడ్ జీవితాన్ని మార్చేసిన ‘బలగం’.. చూస్తే కన్నీళ్లు ఆగవు (వీడియో)

by Disha Web Desk 7 |
మురళిధర్ గౌడ్ జీవితాన్ని మార్చేసిన ‘బలగం’.. చూస్తే కన్నీళ్లు ఆగవు (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్ : బలగం మూవీతో ఎంతో మంది నటులు వెలుగులోకి వచ్చారు. కమిడీయన్‌గా పేరొందిన వేణు యెల్లంటి మంచి డైరెక్టర్‌గా స్టార్ డమ్‌ను అందుకున్నారు. ఈ మూవీకి ఇప్పటికే 36 అవార్డులు వచ్చి టాలీవుడ్‌లో చర్చకు నాంది పలికింది. మరోవైపు చిన్న నటులతో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బ్లాస్టర్ హిట్‌ను అందుకుంది. కుంటుంబ బందాల ఆధారంగా తెరకెక్కిన బలగం మూవీ తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ సినిమాలో హీరోకు మామగా నటించిన మురళిధర్ గౌడ్ బాగా ఫేమస్ అయ్యారు. దశాబ్దంన్నరగా సినీ ఇండస్ట్రీలో ఉన్న ఆయన డీజే టిల్లు సినిమా బ్రేక్ ఇచ్చింది. తాజాగా ఆయన నటించిన బలగంతో తెలంగాణ వ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ‘దిశ’ టీవీతో ప్రత్యేకంగా తన అనుభవాలను పంచుకున్నారు. బలగం మూవీ నా జీవితాన్ని మార్చేసిందని పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మురళిధర్ గౌడ్ పూర్తి ఇంటర్వ్యూ కోసం కింది లింక్‌ను క్లిక్ చేయండి.

Read More: ఆ విషయంలో నా పేరెంట్స్ సంతృప్తిగా లేరు: రష్మిక ఎమోషనల్



Next Story

Most Viewed