మునిపంపులలో బలగం సినిమా ప్రదర్శన

by GSrikanth |
మునిపంపులలో బలగం సినిమా ప్రదర్శన
X

దిశ, వెబ్‌డెస్క్: ఏ అంచనాలు లేకుండా విడుదలైన బలగం సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయం సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో మూడు వారాల్లో రూ.25 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టి ఘన విజయం సాధించింది. థియేటర్లలో చూడటం వీలు కాని వారికోసం అనేక గ్రామాల్లో యువకులు, ప్రజా ప్రతినిధులు 'బలగం' సినిమాను ప్రదర్శిస్తున్నారు. తాజాగా.. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని మునిపంపుల గ్రామంలో బీజేపీ సిటీ వింగ్ ఆధ్వర్యంలో సినిమాను ప్రదర్శించబోతున్నట్లు ప్రకటించారు. ఆదివారం(ఏప్రిల్ 2వ తేదీ) గ్రామంలోని రామాలయ ప్రాంగణంలో సాయంత్రం 7:00 గంటలకు ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. అందరూ తప్పక హాజరై సినిమాను వీక్షించాలని నిర్వాహకుడు మామిండ్ల నరేందర్ గ్రామ ప్రజలను కోరారు.

ఇవి కూడా చదవండి: ఇంకా బతికే ఉన్నారా..? హీరోపై ట్రోల్స్





Next Story

Most Viewed