'Liger' ఈవెంట్‌లో అట్రాక్షన్‌గా రమ్యకృష్ణ.. చీరకట్టులో పోజులు

by Disha Web Desk 7 |
Liger ఈవెంట్‌లో అట్రాక్షన్‌గా రమ్యకృష్ణ.. చీరకట్టులో పోజులు
X

దిశ, సినిమా : పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'లైగర్' మూవీ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో విజయ్, అనన్య పాండే ప్రమోషన్స్‌తో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇదే క్రమంలో మంగళవారం ముంబైలో నిర్వహించిన ఒక ప్రచార కార్యక్రమానికి బాహుబలి ఫేమ్, 'లైగర్' చిత్రంలో విజయ్ తల్లిగా కనిపించిన రమ్యకృష్ణ కూడా హాజరై అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సందర్భంగా చిన్న ఫొటో షూట్‌లో పాల్గొన్న సీనియర్ నటి.. కలర్‌ఫుర్ చీరలో హొయలొలికించింది. తన పైట కొంగు గాలిలో ఎగురుతుండగా.. కెమెరాలు క్లిక్‌మనిపిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఇంత వయసొచ్చినా ఆమె అందం ఏ మాత్రం తరగలేదని కామెంట్లు చేస్తున్నారు.


Next Story

Most Viewed