Jailer 2 : సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.‘జైలర్-2’ ఇప్పట్లో లేనట్టే?

by Mallepaka Hamsa |   (  Updated:2026-05-13 15:42:17  IST  )

తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 4వ తేదీకి వాయిదా వేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. జూన్‌లో విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని సీన్లు రీషూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Jailer 2 : సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.‘జైలర్-2’ ఇప్పట్లో లేనట్టే?
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ రజినీకాంత్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘జైలర్-2’. ఫస్ట్ పార్ట్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించగా.. ఈ రెండో పార్ట్ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఈ సినిమా విడుదల విషయంలో వస్తున్న వార్తలు ఇప్పుడు అభిమానులను కాస్త కలవరపెడుతున్నాయి. నిజానికి ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతున్నప్పటికీ, విడుదల తేదీ మాత్రం మారుతూ వస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 4వ తేదీకి వాయిదా వేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. జూన్‌లో విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని సీన్లు రీషూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

కృష్ణాష్టమి పండగ సందర్భంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మూవీ ఆలస్యం కావడానికి కొన్ని సాంకేతిక కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటి వరకు చిత్రీకరించిన కొన్ని సీన్లు అనుకున్న స్థాయిలో రాలేదని మూవీ టీమ్ భావిస్తోందట. అందుకే కొన్ని మార్పులు చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా, ఇంకా నెల రోజుల పాటు చిత్రీకరణ బ్యాలెన్స్ ఉందట. సీక్వెల్ విషయంలో ఎక్కడా చిన్న తప్పు కూడా జరగకూడదని నెల్సన్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జైలర్-1’ బ్లాక్ బస్టర్ కాబట్టి, పార్ట్-2 అంతకు మించి ఉండాలని నిర్మాతలు బడ్జెట్ విషయంలో గానీ, క్వాలిటీ విషయంలో గానీ అస్సలు రాజీ పడటం లేదట.

సమంత ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ప్రకటించిన మూవీ మేకర్స్

Next Story