రణ్‌బీర్ కపూర్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ‘యానిమల్’ రిలీజ్ డేట్ చేంజ్

by Disha Web Desk 10 |
రణ్‌బీర్ కపూర్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ‘యానిమల్’ రిలీజ్ డేట్ చేంజ్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ హీరోగా నటిస్తోన్న పాన్ ఇండియా మూవీ ‘యానిమల్’. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇందులో హీరోయిన్‌గా రష్మిక నటిస్తుండగా.. ఈ మూవీని ఆగస్టు 11న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. దీంతో అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతుండగా.. ప్రజెంట్ ఊహించని షాక్ ఇచ్చారు. గతంలో ఇచ్చిన మూవీ రిలీజ్ డేట్‌ క్యాన్సిల్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అనుకోని కారణాలతో డిసెంబర్ నెలలో ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. కానీ అది కూడా స్పష్టత లేనట్లు తెలుస్తోంది. దీంతో రణబీర్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. హఠాత్తుగా ఎందుకు రిలీజ్ డేట్ మార్చారనేది చర్చనీయాంశంగా మారింది.

Read More..

‘ధూమమ్’ ఓటీటీ రిలీజ్ డేట్ అప్‌డేట్..

Next Story

Most Viewed