Bhairava Dweepam : ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. బాల‌కృష్ణ సినిమా వాయిదా

by Kodari Anjali |   (  Updated:2023-08-30 05:29:22  IST  )

నందమూరి బాలకృష్ణ ఎప్పుడో 29 ఏళ్ల కిందట నటించిన ‘ భైరవ ద్వీపం’ సినిమాను మళ్లీ 4K క్వాలిటీతో రీరిలీజ్ కి ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.

Bhairava Dweepam : ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. బాల‌కృష్ణ సినిమా వాయిదా
X

దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ ఎప్పుడో 29 ఏళ్ల కిందట నటించిన ‘ భైరవ ద్వీపం’ సినిమాను మళ్లీ 4K క్వాలిటీతో రీరిలీజ్ కి ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఆగస్టు 30న విడుదల అవుతుందని అనౌన్స్ కూడా చేశారు. కానీ ఆశించిన మేర అడ్వాన్స్ బుకింగ్ లేకపోవడంతో వాయిదా వేయాల్సి వచ్చింది. దీంతో ఇప్పుడీ మూవీ రీరిలీజ్ ఏకంగా నవంబర్ కు వాయిదా పడింది. అడ్వాన్స్ బుకింగ్స్ చాలా దారుణంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక క్లాప్స్ ఇన్ఫోటైన్మెంట్ కు చెందిన చంద్రశేఖర్ కుమారస్వామి, దేవ్ వర్మ ఈ మూవీ రీరిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ న్యూ డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు.

Next Story