బాలయ్య అభిమానులకు బ్యాడ్ న్యూస్.. కీలక ప్రకటన చేసిన ‘NBK111’ టీమ్

by Mallepaka Hamsa |

నందమూరి బాలకృష్ణ( Balakrishna ) భారీ ప్రాజెక్ట్స్ చేస్తూనే రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య ‘అఖండ-2’ షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు.

బాలయ్య అభిమానులకు బ్యాడ్ న్యూస్.. కీలక ప్రకటన చేసిన ‘NBK111’ టీమ్
X

దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ( Balakrishna ) భారీ ప్రాజెక్ట్స్ చేస్తూనే రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య ‘అఖండ-2’ షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. సూపర్ హిట్ ‘అఖండ’కు సీక్వెల్‌గా రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీ విడుదల కాకముందే.. బాలయ్య మరో భారీ ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టారు. గోపీచంద్ మలినేని(Gopichand Malineni) దర్శకత్వంలో మరో మూవీ చేయనున్నారు. ఇది ‘NBK-111’ వర్కింగ్ టైటిల్‌తో రాబోతుంది. గతంలో వీరసింహారెడ్డిలో బాలయ్యను కొత్తగా, డిఫరెంట్‌గా చూపించిన గోపీచంద్.. ఈసారి మాత్రం ఆయనను మరో లెవల్‌లో చూపించనున్నారట. బాలయ్య కెరీర్‌లోనే ఎప్పుడు రాని స్థాయిలో ఈ సినిమా ఉంటుందని గాసిప్స్ వైరల్ అవుతుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నారు.

ఈ చిత్రాన్ని వ్రిద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఇక ఇటీవల మూవీ మేకర్స్ ఇందులో మహారాణి పాత్రను పరిచయం చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ పోస్టర్ నవంబర్ 3న 12గంటలకు రావాల్సి ఉండగా.. పలు కారణాల వల్ల వాయిదా వేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలో జరిగిన బస్సు ప్రమాదం కారణంగా ఈ అప్డేట్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రమాదంలో మరణించిన 21 మందికి సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు మూవీ టీమ్ సానుభూతి, ప్రార్థనలను తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఇక ‘NBK-111’ అప్డేట్ వాయిదా పడిన విషయాన్ని తెలుసుకున్న బాలయ్య అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.

LINK

Next Story