Samantha : విజయ్ దేవరకొండతో సమంత డ్యాన్స్.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

by Disha Web Desk 10 |
Samantha : విజయ్ దేవరకొండతో సమంత డ్యాన్స్..  ఫైర్ అవుతున్న ఫ్యాన్స్
X

దిశ, సినిమా: విజయ్ దేవరకొండ, సమంత జంటగా వస్తున్న తాజా చిత్రం ‘ఖుషి’. శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ లవ్ స్టోరీ సెప్టెంబర్ 1న విడుదలకానుండగా ఆగస్టు 15న ఆడియో లాంచ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు మేకర్స్. అయితే ఇందులో ‘ఖుషి’ సాంగ్స్‌లో విజయ్, సామ్ కలిసి స్టేజి మీద అద్భుతంగా డ్యాన్స్ చేశారు. విజయ్ షర్ట్ తీసేసి ఆమెను ఎత్తుకొని చుట్టూ తిప్పుతూ హంగామా చేయగా ఈ వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో సమంత డ్యాన్స్ చూసి షాక్ అయిన నెటిజన్లు.. ‘చైతూ అన్నతో ఎప్పుడైనా ఇలా చేశావా? అయినా నీకు కండరాల రోగం ఉందనే విషయం మరిచావా? మొగుడు దగ్గర నాటకాలు.. మందితో సరసాలు’ అంటూ తిట్టిపోస్తున్నారు. ఇక విజయ్‌ను ఉద్దేశిస్తూ.. ‘వీడు ఏమి మారలేదు బ్రోస్. ఈ ఓవర్ యాక్షన్‌తోనే లైఫ్ నాశనం చేసుకుంటున్నాడు’ అంటూ నెగెటీవ్ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story

Most Viewed