‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ థర్డ్ సింగిల్ అప్డేట్.. హాట్ బ్యూటీ పోస్టర్‌తో హీట్ పెంచిన మేకర్స్

by Mallepaka Hamsa |   (  Updated:2025-09-30 11:34:51  IST  )

టాలీవుడ్ హీరో నాగశౌర్య (Naga Shaurya)రెండేళ్ల తర్వాత ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ (Bad Boy Karthik)చిత్రంతో ప్రేక్షకులను అలరించబోతున్నారు.

‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ థర్డ్ సింగిల్ అప్డేట్.. హాట్ బ్యూటీ పోస్టర్‌తో హీట్ పెంచిన మేకర్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో నాగశౌర్య (Naga Shaurya)రెండేళ్ల తర్వాత ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ (Bad Boy Karthik)చిత్రంతో ప్రేక్షకులను అలరించబోతున్నారు. రామ్ దేశినా(Ram Desina) దర్శకత్వంలో తెరకెక్కుతుండగా.. శ్రీవైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై చింతలపూడి శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. ఇందులో విధి యాదవ్(Viidhi Yadav) హీరోయిన్‌గా నటిస్తుండగా.. సముద్రఖని, వీకే నరేష్, గోపీ, శ్రీదేవి విజయ్ కుమార్, వెన్నెల కిషోర్, సాయి కుమార్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈక్రమంలో మ్యూజికల్ జర్నీ స్టార్ట్ చేసిన చిత్రబృందం వరుసగా ఇందులోని పాటలను రిలీజ్ చేస్తున్నారు.

తాజాగా, ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ సినిమా నుంచి ఐటమ్ సాంగ్ రాబోతున్నట్లు మూవీ మేకర్స్ వెల్లడించారు. ‘‘ఈ చిత్రానికి సంబంధించిన మూడో పాట అక్టోబర్ 1న ఉదయం 11:45గంటలకు రాబోతుంది. సిజ్లింగ్ మ్యాడ్‌నెస్ మరియు ఎలక్ట్రిఫైయింగ్ బీట్స్‌తో ఇది మరింత వేడిగా మారబోతోంది. తట్టుకునేందుకు సిద్ధంగా ఉండండి. అమెరికా నుండి వచ్చాను అని సాగే ఈ పాటలో స్నేహగుప్తా హీట్ పెంచనుంది’’ అని రాసుకొచ్చారు. అలాగే ఓ హాట్ పోస్టర్‌ను షేర్ చేసి కుర్రాళ్లలో హీట్ పెంచేశారు. ఇక ఇందులో స్నేహ గుప్తా బ్లూ కలర్ డ్రెస్‌లో థైయ్స్ ఫో చేస్తూ ఘాటు అందాలు చూపిస్తోంది.

Next Story