‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ ఫస్ట్ సింగిల్ అప్డేట్.. హై ఓల్టేజ్ డ్యాన్స్ నెంబర్ అంటూ హైప్ పెంచిన మేకర్స్

by Mallepaka Hamsa |

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య(Naga Shaurya) 2023లో ‘రంగబలి’ సినిమాతో ప్రేక్షకులను అలరించారు.

‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ ఫస్ట్ సింగిల్ అప్డేట్.. హై ఓల్టేజ్ డ్యాన్స్ నెంబర్ అంటూ హైప్ పెంచిన మేకర్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య(Naga Shaurya) 2023లో ‘రంగబలి’ సినిమాతో ప్రేక్షకులను అలరించారు. కానీ ఈ మూవీ బాక్సాఫీసు వద్ద హిట్ అందుకోలేక డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత ఏడాది పాటు ఇండస్ట్రీకి కాస్త గ్యాప్ ఇచ్చిన ఆయన.. ప్రస్తుతం వరుస సినిమాలు అనౌన్స్ చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నాగశౌర్య ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’(Bad Boy Karthik) టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాతో రామ్ దేశిన దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.

ఇందులో విధి హీరోయిన్‌గా నటిస్తుండగా.. సముద్రఖని(Samuthirakani), వీకే నరేష్, సాయికుమార్, వైమ్ గోపీ, శ్రీదేవి విజయ్ కుమార్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీని శ్రీవైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై చింతలపూడి శ్రీనివాస రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నాగశౌర్య పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ నుంచి మూవీ మేకర్స్ వరుస అప్డేట్స్ విడుదల చేస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకోగా.. మ్యూజికల్ జర్నీ ప్రారంభించారు. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ విడుదల కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ‘నా మావ పిల్లనిత్తనన్నడే’ అని సాగే ఈ పాట ఆగస్టు 8న రిలీజ్ కానున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్‌ను షేర్ చేశారు. ఇందులో నాగశౌర్య హీరోయిన్‌ను ఎత్తుకుని మాస్‌లుక్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఇందులో డ్యాన్స్ ఎక్కువగా ఉండనున్నట్లు కూడా మూవీ మేకర్స్ తెలపడంతో నెటిజన్లలో ఆసక్తి పెరిగిపోయింది.

link

Next Story