బాబాయ్ అందరిముందే నా వక్షోజాల గురించి అలా అన్నాడు.. టాలీవుడ్ బ్యూటీ సంచలన కామెంట్స్

by Mallepaka Hamsa |

ఇటీవల కాలంలో ఎంతోమంది ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని తమ ఆవేదన వ్యక్తం చేశారు.

బాబాయ్ అందరిముందే నా వక్షోజాల గురించి అలా అన్నాడు.. టాలీవుడ్ బ్యూటీ సంచలన కామెంట్స్
X

దిశ, సినిమా: ఇటీవల కాలంలో ఎంతోమంది ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని తమ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఎదురైన చేదు అనుభవాలను కూడా గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. ఇక మరికొందరికి అందరూ చూస్తుండానే పబ్లిక్‌గా ఊహించని సంఘటనలు ఎదురుకావడంతో సోషల్ మీడియా ద్వారా తమ బాధను వ్యక్త పరిచారు. ఇక సెలబ్రిటీల పరిస్థితే అలా ఉంటే.. సమాజంలో మహిళల పరిస్థితి మరింత దారుణంగా మారింది. పట్టపగలు కూడా స్ట్రీలు స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితులు నెలకొన్నాయి. రోడ్డు, ఆఫీసులోనే కాకుండా సొంతింటిలోనూ ఆడపిల్లలకు రక్షణ కరువైంది. రక్త సంబంధీకులే మహిళ పాలిట కీచకులుగా మారుతున్నారు. సామాన్యులే కాకుండా సెలబ్రిటీలకు కూడా లైంగిక వేధింపులకు గురవుతున్నారు.

తాజాగా, తనకు ఎదురైన చేదు అనుభవాన్ని టాలీవుడ్ యంగ్ బ్యూటీ అయేషా ఖాన్(Ayesha Khan) వెల్లడించింది. తెలుగులో ‘ముఖ చిత్రం’ (mukha chitram)సినిమాతో ఇండస్ట్రీకి వచ్చింది. ఆ తర్వాత గ్యాంగ్ ఆఫ్ గోదావరి, ఓం భీమ్ బుష్ (Om Bheem Bush)వంటి చిత్రాలతో మెప్పింది కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసింది. అలాగే బిగ్‌బాస్ షోలోనూ పాల్గొని తన పాపులారిటీ పెంచుకుంది 11 వారాలపాటు హౌస్‌లో ఉండి ఊహించిన విధంగా ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అయేషా ఖాన్.. ‘‘నేను చిన్న వయస్సులోనే లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాను.

ఓ రోజు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా.. మా నాన్నగారి ఫ్రెండ్ ఒకరు పిలిచారు. ఆయనను బాబాయ్ అని పిలిచే దానిని.. వెనక్కి తిరిగి చూడగా ఆయన కనిపించాను. తను స్కూటర్‌పై వచ్చి నీ వక్షోజాలు చాలా బాగున్నాయని అసభ్యంగా మాట్లాడాడు. ఆ మాటల గురించి ఆలోచిస్తూ షాక్‌లో ఉండగానే బాబాయ్ మళ్లీ వెనక్కీ వచ్చి నాకు కన్ను కొట్టి.. అసభ్యంగా సైగలు చేశాడు. అలా ఎందుకన్నాడో అర్థం కానీ వయసు నాది. వెంటనే ఇంటికి వెళ్లి కూర్చొని ఏడ్చేశాను. ఇప్పటికీ ఆ సంఘటన గుర్తొస్తే కన్నీరు ఆగవు చాలా బాధగా ఉంటుంది’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.

Next Story