రామ్ పోతినేని పెళ్లిపై క్లారిటీ ఇచ్చి న బాబాయ్

by samatah |   (  Updated:2023-06-17 03:05:19  IST  )

రామ్ పోతినేని గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన నటన , స్టైల్‌తో ఎంతో మంది అమ్మాయిలను తన వైపు తిప్పుకున్నాడు. ఈ కుర్ర హీరో. ఇక రామ్ పెళ్లి గురించిన వార్తలు ఎప్పుడూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి.

రామ్ పోతినేని పెళ్లిపై క్లారిటీ ఇచ్చి న బాబాయ్
X

దిశ, వెబ్‌డెస్క్ : రామ్ పోతినేని గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన నటన , స్టైల్‌తో ఎంతో మంది అమ్మాయిలను తన వైపు తిప్పుకున్నాడు. ఈ కుర్ర హీరో. ఇక రామ్ పెళ్లి గురించిన వార్తలు ఎప్పుడూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. ఈయన త్వరలోనే హైదరాబాద్ కి చెందిన ప్రముఖ బిజినెస్ మాన్ కూతురు నీ ఆయన వివాహం చేసుకోబోతున్నారు అంటూ.. ఆమె ఒక సాఫ్ట్వేర్ అంటూ వార్తలు బాగా వైరల్ అయ్యాయి.

కాగా, తాజాగా ఈ వార్తలపై రామ్ బాబాయ్ స్రవంతి రవి కిషోర్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామ్ పెళ్ళి చేసుకోబోతున్నారంటూ వస్తున్నటువంటి వార్తల్లో ఏమాత్రం నిజం లేదని, ఒకవేళ రామ్ కి వివాహం కనుక నిశ్చయమైతే ఇక ఆ విషయం దాచాల్సిన అవసరం లేదు.. అందరితో ఈ విషయం తప్పకుండా పంచుకుంటాము అంటూ స్రవంతి రవి కిషోర్ రామ్ పెళ్లి గురించి క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇక ఈయన కామెంట్స్ తో నైనా,రామ్ పెళ్లిపై వస్తున్న పుకార్లు తగ్గుతాయో లేదో వేచి చూడాలి మరి.

Also Read: ఈ వారం ఓటీటీ, థియేటర్లో విడుదల కాబోయే ఇంగ్లీష్ సినిమాలు ఇవే..

Next Story