వెన్నులో వణుకు పుట్టిస్తున్న అవికా గోర్.. పోస్టర్ వైరల్

by Disha Web Desk 7 |
వెన్నులో వణుకు పుట్టిస్తున్న అవికా గోర్.. పోస్టర్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ ‘మాన్షన్ 24’. మిస్టరీ అండ్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ హాట్ స్టార్ నిర్మిస్తుంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సిరీస్‌కు యాంకర్ ఓంకార్ దర్శకత్వం వహిస్తు్న్నారు. ఈ సిరీస్ నుంచి ఇప్పటికే రిలీజైన వరలక్ష్మి పోస్టర్ ఎంతగానో ఆకట్టుకోగా.. ప్రస్తుతం అవికా గోర్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. రక్తంతో తడిసిన ఒక వెపన్ పట్టుకుని.. కళ్లల్లో కోపం రక్తం రూపంలో కనిపిస్తున్న ఈ పోస్టర్ వెన్నులో వణుకు పుట్టే విధంగా ఉంది. ఈ పోస్టర్‌తో ‘మాన్షన్ 24’ సిరీస్‌పై మరింత క్యూరియాసిటీ పెరిగిందని చెప్పుకోవచ్చు. కాగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్‌ను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.



Next Story

Most Viewed