- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండియాను వదిలేసిన అవికా గోర్.. భర్త కోసం సంచలన నిర్ణయం!
గతేడాది సెప్టెంబర్‌లో మిలింద్ చంద్వానీని వివాహం చేసుకున్న ఆమె, ఇప్పుడు తన నివాసాన్ని శాశ్వతంగా బ్యాంకాక్‌కు మార్చేసింది.

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ అవికా గోర్ తన జీవితంలో కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టారు. గతేడాది సెప్టెంబర్‌లో మిలింద్ చంద్వానీని వివాహం చేసుకున్న ఆమె, ఇప్పుడు తన నివాసాన్ని శాశ్వతంగా బ్యాంకాక్‌కు మార్చేసింది. మిలింద్ వృత్తిపరమైన ఎదుగుదలకు అక్కడ మంచి అవకాశాలు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని, ఒకరి కెరీర్‌కు ఒకరం మద్దతుగా ఉండటం తమకు ఎంతో ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. అక్కడ ఒక సొంత ఇంటిని కూడా కొనుగోలు చేశామని, తన అభిరుచికి తగ్గట్టుగా ఆ ఇంటిని తీర్చిదిద్దుకోవడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందని ఆమె ఎంతో ఎగ్జైటింగ్‌గా వెల్లడించారు. మకాం మార్చినంత మాత్రాన తన కెరీర్‌కు ఎలాంటి ఆటంకం కలగదని అవికా చాలా ధీటుగా సమాధానమిచ్చారు. తాను ముంబైలో ఉన్నప్పుడు కూడా షూటింగ్‌ల కోసం హైదరాబాద్, విశాఖపట్నం వంటి నగరాల్లోనే ఎక్కువ సమయం గడిపేదాన్ని అని, కాబట్టి బేస్ ఎక్కడ ఉందనేది ముఖ్యం కాదని ఆమె వివరించారు.
ఎవరైనా తనతో పని చేయాలనుకుంటే వారు తన షెడ్యూల్ ప్రకారమే వస్తారని, తన వృత్తిపరమైన బాధ్యతలే తనకు ఎప్పుడూ మొదటి ప్రాధాన్యత అని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆమె షూటింగ్స్ నిమిత్తం తరచుగా ముంబై, హైదరాబాద్‌లకు ప్రయాణిస్తూనే ఉన్నారు. తాను విదేశంలో స్థిరపడినా తన మూలాలు ఎప్పుడూ భారత్‌లోనే ఉంటాయని అవికా ఎమోషనల్ అయ్యారు. తన తల్లిదండ్రులు, బంధువులంతా ఇక్కడే ఉన్నారని, అందుకే తన ప్రాణం ఎప్పుడూ ఇండియాలోనే ఉంటుందని ఆమె అన్నారు. వృత్తిపరంగా కూడా ఆమె ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్నారు; త్వరలో 'ఖత్రోన్ కే ఖిలాడీ' షూటింగ్‌లో పాల్గొనబోతుండగా, ఆమె నటించిన కొత్త సౌత్ సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితం అత్యుత్తమ దశలో ఉందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.






