- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెళ్లైన పది రోజులకే గుడ్ న్యూస్ ప్రకటించిన అవికా గోర్.. పోస్ట్‌తో అంతా షాక్!
అవికా గోర్(Avika Gore) ఇటీవల ‘షణ్ముఖ’ సినిమాతో ప్రేక్షకులను అలరించింది.

దిశ, సినిమా: అవికా గోర్(Avika Gore) ఇటీవల ‘షణ్ముఖ’ సినిమాతో ప్రేక్షకులను అలరించింది. వరుస చిత్రాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్న ఈ భామ సడెన్‌గా బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పి తన ప్రియుడు మిలింద్ చద్వానిని పెళ్లి చేసుకుంది. సెప్టెంబర్ 30న వీరిద్దరు రియాలిటీ షోలో ఒక్కటయ్యారు. ఐదారేళ్లుగా ప్రేమలో ఈ జంట కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఈ విషయం తెలుసుకున్న వారంతా ఇండస్ట్రీకి దూరం అవుతుందని భావించారు. ఈ క్రమంలో.. తాజాగా, అవికా గోర్ కొత్త సినిమా ప్రకటించింది. అంతేకాకుండా షూటింగ్ కూడా మొదలైనట్లు తెలుపుతూ ఫొటోలు షేర్ చేసింది. ‘రాజు భజేవాలా’ (raaju Bhajewala)టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అవికా గోర్, చందన్ రాయ్(Chandan Roy) జంటగా నటిస్తున్నారు.
బ్యాండ్ మ్యూజిషియన్ జీవిత కథ ఆధారంగా రాబోతున్న ఈ చిత్రానికి పలాష్ ముచ్చల్ దర్శకత్వం వహిస్తున్నారు. అమన్ గుప్తా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ మధ్యప్రదేశ్‌లో మొదలైంది. ఓటీటీ చలనచిత్రంగా రాబోతుంది. ఇక ఇందులో అవికా గోర్ ఓ పెళ్ళైన మహిళ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. ‘‘న్యూ బిగినింగ్స్’ అంటూ రాసుకొచ్చింది. దీంతో అది చూసిన నెటిజన్లు అమ్మడు పెళ్లి చేసుకుని హనీమూన్‌కు వెళ్లి భర్తతో ఎంజాయ్ చేస్తుందనుకుంటే.. మళ్లీ సినిమాలు చేస్తుందని అంతా ఆశ్చర్యపోతున్నారు. మరికొందరు మాత్రం కంగ్రాట్స్ చెబుతున్నారు.






