అవతార్-2: మొదటి వీక్‌లో ఇండియన్ సినిమాలో షాకింగ్ కలెక్షన్

by Disha Web Desk 12 |
అవతార్-2: మొదటి వీక్‌లో ఇండియన్ సినిమాలో షాకింగ్ కలెక్షన్
X

దిశ, వెబ్‌డెస్క్: హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన అవతార్ -2 భారత్ లో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మొదటి 7 రోజుల్లో 200 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. దీంతో ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అలాగే అవతార్: ది వే ఆఫ్ వాటర్ తన ఎనిమిదో రోజు అన్ని భాషలకు కలిపి 13.25 కోట్లు సంపాదించింది. కాగా తదుపరి రెండు రోజులు వీకెండ్స్ కావడంతో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గతంలో రిలీజ్ అయిన హాలీవుడ్ చిత్రం ఎవెంజర్స్ ఎండ్‌గేమ్ పెట్టిన లాండ్ మార్క్ ను దాటి అవతార్-2 విజేతగా నిలిచిందని చెప్పుకొవాలి. మంచి సినిమాలకు భారీ ప్రచార కార్యక్రమాలు అవసరం లేదని, అది లేకుండా కూడా మంచి విజయాన్ని సాధిస్తుందని అవతార్ సినిమా నిరూపించింది.

Also Read..

Balayya సెట్లో పవన్ సందడి



Next Story

Most Viewed