- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యాటిట్యూడ్ స్టార్ రచ్చ.. ఆది సాయి కుమార్‌కు తప్పని తిప్పలు.. అసలేం జరిగిందంటే?
టాలీవుడ్ సీనియర్ నటుడు ప్రభాకర్ కొడుకు చంద్రహాస్(Chandrahas) ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు.

దిశ, సినిమా: టాలీవుడ్ సీనియర్ నటుడు ప్రభాకర్ కొడుకు చంద్రహాస్(Chandrahas) ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. తన రెండో సినిమా ‘బరా బర్ ప్రేమిస్తా’ మూవీ ఈవెంట్‌లో ఆయన పాడిన ఒక పాట ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతోంది. ఆ పాటలోని పదజాలం అసభ్యకరంగా ఉందంటూ నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. సాధారణంగా సినిమా ప్రమోషన్లు అంటే పాజిటివ్ వైబ్ ఉండాలి, కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. ఈ విమర్శలపై చంద్రహాస్ స్పందించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. తాను పాడిన పాట గురించి అస్సలు బాధపడటం లేదని, ఎవరికీ క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని ఆయన ఒక వీడియో విడుదల చేశాడు. అంతటితో ఆగకుండా, తనను విమర్శించిన ఒక నెటిజన్‌కు వార్నింగ్ ఇవ్వడంతో గొడవ మరింత పెద్దదైంది. ఈ వ్యవహారం చిలికి చిలికి గాలివానలా మారి చివరకు పోలీస్ కేసు వరకు వెళ్లింది. ప్రస్తుతం పోలీసులు ఈ విషయంపై విచారణ జరుపుతున్నారు.
ఈనేపథ్యంలో.. తాజాగా హీరో ఆది సాయి కుమార్(Aadi Sai Kumar) స్పందించారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వెళ్లిన ఆయన, స్టేజ్‌పై జరిగిన పరిణామాలపై ఎట్టకేలకు మౌనం వీడారు. ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ‘‘ప్రభాకర్ గారు పిలవడం వల్లే నేను అక్కడికి వెళ్లాను. ఆ కార్యక్రమంలో జరిగిన సంఘటన అసలు ఊహించనిది. బహిరంగ సభల్లో ఇచ్చే సందేశాలు బాధ్యతాయుతంగా ఉండాలి, ఎందుకంటే అక్కడ కుటుంబాలు ఉంటాయి’’ అని రాసుకొచ్చారు. అయితే, ఏమైందో ఏమో కానీ.. నిమిషాల వ్యవధిలోనే ఆ ట్వీట్‌ను ఆది డిలీట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఆది సాయి కుమార్ ట్విట్టర్ ఖాతాలో ఆ పోస్ట్ కనిపించడం లేదు. ఆయన స్వచ్ఛందంగా తొలగించారా? లేక మరేదైనా ఒత్తిడి వల్ల తీసేశారా? అన్నది అర్థం కాక నెటిజన్లు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జేడీ చక్రవర్తి కూడా ఈ ఘటనపై అసహనం వ్యక్తం చేయగా, చంద్రహాస్‌పై మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. చంద్రహాస్ మాత్రం తాను క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని మొండిగా వ్యవహరించడం ఈ వివాదాన్ని మరింత పెంచుతోంది.
ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ వన్‌గా టాలీవుడ్ హీరో సినిమా.. పోస్ట్ వైరల్






