Sonu Sood: బంగ్లాలో హిందువులపై దాడులు.. ఆదుకుంటానంటూ హీరో సోనూ సూద్ పోస్ట్

by Hamsa |
Sonu Sood: బంగ్లాలో హిందువులపై దాడులు.. ఆదుకుంటానంటూ హీరో సోనూ సూద్ పోస్ట్
X

దిశ, సినిమా: గతంలో కరోనా వచ్చి లాక్ డౌన్ పడటంతో ఎంతోమంది వలస వెళ్లిన వారు తిండి, నిద్ర లేక పలు ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రియల్ హీరో సోనూసూద్ రియాక్ట్ అయి వారందరినీ ఆదుకుని వారి సొంత ఊర్లకు తరలించాడు. అప్పటి నుంచి సహాయం కావాలని కోరిన వారందరికీ తనవంతు సాయం చేస్తూ జనాలను ఆదుకుంటున్నాడు. అయితే సోనూసూద్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు. బంగ్లాదేశ్ ఘర్షణల్లో దాడికి గురవుతున్న హిందువులను ఆదుకుంటానని భరోసా ఇచ్చాడు.

అసలు విషయంలోకి వెళితే.. బాంగ్లాలో జరుగుతున్న ఘర్షణల కారణంగా ఎంతో మంది వలస వెళ్లిన వారంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే ఇప్పటి వరకూ 300 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో.. హిందూ మహిళ తన ఆవేదనను వ్యక్తం చేస్తూ వీడియోను షేర్ చేసింది. అలాగే తన ప్రాణాలు కాపాడుకోవడానికి ఇండియాకి వెళ్లాలనుకుంటున్నట్లు వెల్లడించింది.

ఆ వీడియో కాస్త బాలీవుడ్ హీరో సోనూసూద్ కంటపడింది. దీనిపై ఆయన స్పందిస్తూ పోస్ట్ పెట్టాడు. ‘‘ బంగ్లాదేశ్ నుంచి మన తోటి భారతీయులందరినీ ఇండియాకు రప్పించేందుకు మా వంతు ప్రయత్నాలు చేస్తాం. ఇక్కడ వారికి మంచి లైఫ్ దొరుకుతుంది. ఇది కేవలం ప్రభుత్వ బాధ్యతే కాదు. మనందరికీ. జై హింద్’’ అని రాసుకొచ్చాడు. ప్రజెంట్ ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా.. అది చూసిన వారంతా సోనూసూద్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.



Next Story

Most Viewed