- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘రాకా’ విషయంలో అట్లీ మాస్టర్ ప్లాన్.. ఫోర్ రోల్స్‌లో మ్యాజిక్ చేయబోతున్న అల్లు అర్జున్!

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ దర్శకుడు అట్లీ కాంబోలో రాబోతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రాకా’. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా, ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఒకేసారి నాలుగు వేర్వేరు పాత్రల్లో నటిస్తున్నట్లు టాక్. ఇందులో ఆయన తాత, తండ్రి, ఇద్దరు కొడుకులుగా.. ఇలా మూడు తరాలకు సంబంధించిన నాలుగు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించనున్నారని సమాచారం. నిజానికి దర్శకుడు అట్లీ మొదట ఈ కథలో కేవలం డబుల్ రోల్ మాత్రమే ప్లాన్ చేశారట. తండ్రి, తాత పాత్రల కోసం వేరే సీనియర్ నటులను తీసుకోవాలని భావించారట. కానీ, ఈ విషయం తెలుసుకున్న అల్లు అర్జున్, ఆ పాత్రల ప్రాధాన్యతను బట్టి తానే ఆ నాలుగు క్యారెక్టర్లు చేస్తానని అట్లీకి చెప్పినట్లు టాక్.
బన్నీ ఆసక్తిని చూసి దర్శకుడు అట్లీ ఆయనపై ప్రత్యేకంగా లుక్ టెస్ట్ నిర్వహించారట. ఆ లుక్స్ అన్నీ అద్భుతంగా కుదరడం, పైగా ఒకే సినిమాలో అల్లు అర్జున్ నాలుగు పాత్రల్లో కనిపిస్తే అది మూవీకే అతిపెద్ద ప్లస్ పాయింట్ అవుతుందని భావించి అట్లీ ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రతి పాత్రకు వైవిధ్యమైన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ ఉండేలా అట్లీ ఎంతో కేర్ తీసుకుంటున్నారట. ప్రస్తుతం దీనికి సంబంధించిన పలు పోస్టులు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. ఒకవేళ ఇదే నిజమైతే, వెండితెరపై అల్లు అర్జున్ ఫోర్ రోల్స్‌తో సరికొత్త మ్యాజిక్ చేయడం ఖాయమని అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మరోవైపు అల్లు అర్జున్ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన సినీ కెరీర్‌లో ఇంతవరకు ఇలాంటి మల్టిపుల్ రోల్స్ ఉన్న సినిమా చేయలేదు, ఇదే మొదటి ప్రాజెక్ట్ కావడం విశేషం.






