ఆ స్టార్ హీరోతో పాన్ ఇండియా సినిమా చేయబోతున్న అట్లీ.. కాంబో సూపర్ అంటున్న నెటిజన్లు

by Mallepaka Hamsa |   (  Updated:2025-10-14 06:11:48  IST  )

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ(Atlee), ఐకాన్ స్టార్ కాంబోలో భారీ ప్రాజెక్ట్ ‘AA-22’ రాబోతున్న విషయం తెలిసిందే.

ఆ స్టార్ హీరోతో పాన్ ఇండియా సినిమా చేయబోతున్న అట్లీ.. కాంబో సూపర్ అంటున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ(Atlee), ఐకాన్ స్టార్ కాంబోలో భారీ ప్రాజెక్ట్ ‘AA-22’ రాబోతున్న విషయం తెలిసిందే. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్‌గా కనిపించనుంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, అట్లీకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘AA22’ షూటింగ్ కంప్లీట్ కాకముందే అట్లీ ఓ పాన్ ఇండియా చిత్రాన్ని లైన్‌లో పెట్టనున్నట్లు టాక్.

యశ్(Yash) హీరోగా.. ఈ సినిమా రాబోతుండగా.. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ విషయం అట్లీ హింట్ ఇచ్చారు. ‘‘యష్ సర్ నాకు చాలా మంచి స్నేహితుడు. ఆయన పట్ల, ఆయన పని తీరు పట్ల నాకు అపారమైన గౌరవం ఉంది. చూద్దాం ఏదైనా జరుగుతుందేమో” అని చెప్పుకొచ్చారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఆ సినిమాపై హింట్ ఇచ్చాడని అంటున్నారు. అలాగే కాంబో అదిరిపోయిందని అంటున్నారు.

READ MORE ......

బాల‌య్య కొత్త మూవీ స్టోరీ లీక్‌...మాఫియా లీడర్‌గా ఎంట్రీ !

Next Story